అనంతపురం

గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, నవంబర్ 17 : తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించినట్లు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 40 శాతం మంది కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం ద్వారానే పార్టీని తిరిగి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులను ప్రోత్సహించేది లేదన్నారు. కరువుకు నిలయమైన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు అవసరమైన స్థాయిలో కృష్ణాజలాలు విడుదల చేయాలని కోరామన్నారు. ప్రత్యేకించి జిల్లాకు వంద టిఎంసీల నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రికి నివేదిక అందజేశామన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు జేసీ నాగిరెడ్డి తాగునీటి ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గుత్తి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.163 కోట్లు, పామిడి మున్సిపాలిటికి రూ.48 కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామని, టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభిస్తామన్నారు. అంతకు ముందు ఆర్‌అండ్‌బీ బంగ్లా ఆవరణలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
చంద్రన్న కానుక సరుకుల్లో నాణ్యత పాటించాలి
* మంత్రి పరిటాల సునీత
అనంతపురం సిటీ, నవంబర్ 17: 2019 సంవత్సరానికి తెల్ల రేషన్ కార్డుదారులకు అందించే చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుక సరుకులలో నాణ్యత పాటించాలని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పౌర సరఫరాల అధికారులకు సూచించారు. శనివారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల సరుకుల శాంపిల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చంద్రన్న కానుకలు అందజేస్తుందని, సరుకుల నాణ్యతలో రాజీ పడకుండా నాణ్యమైన సరుకులు ప్రజలకు అందజేయాలని సూచించారు. రేషన్ దుకాణాలకు సరుకులు సరఫరా చేసేటప్పుడే అధికారులు నాణ్యతను పరిశీలించి పంపాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ తోఫాలను అందజేయడం జరుగుతోందన్నారు. ఈ కానుకలలో అందించే సరుకులు నాసిరకంగా లేకుండా ఇప్పటి వరకు అందించామని, ఇప్పుడు కూడా అదేవిధంగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.