అనంతపురం

వీధికుక్కల వీరంగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 20 : జిల్లావ్యాప్తంగా పట్టణాలతోపాటు గ్రామాల్లో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రాత్రిళ్లు కుక్కల దాడితో అనేక మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. నెల్లూరు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో చోటు చేసుకున్న ఘటనలతో జిల్లావాసులు కూడా తీవ్రభయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అనంతపురం పట్టణంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. నగరంలోని రామ్‌నగర్, సాయినగర్, అరవిందనగర్, హౌసింగ్ బోర్డు, రామచంద్రనగర్, వేణుగోపాల్ నగర్, రాణినగర్, హమాలీ కాలనీతో పాటు రుద్రంపేట, విద్యారణ్య నగర్, తపోనగర్ తదితర ప్రాంతాల్లో కుక్కలు అధికంగా ఉన్నాయి. ద్విచక్రవాహనంలో వెళ్లాలంటే గుండెలు చేతుల్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇక రాత్రిళ్లు వాహనం స్పీడు పెంచితే వెంటపడి మరీ తరుముతున్నాయి. కనీసం ఐదారు నుంచి 15 దాకా గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. దీంతో భయంతో బాటసారులు, వాహనదారులు వణికిపోతున్నారు. అనంతపురం నగరంతో పాటు చుట్టుపక్కల కాలనీలు, గ్రామాలు, వివిధ మండలాలకు చెందిన పలువురు కుక్కల దాడిలో గాయపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. నిత్యం కనీసం 15 నుంచి 20 మంది దాకా జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కుక్క కాటును బట్టి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా కుక్కకాటుకు గురైన బాధితులకు తక్షణ వైద్య సాయం కోసం ప్రభుత్వ వైద్యశాలల్లో రేబిస్ వ్యాక్సిన్‌ను నిత్యం అందుబాటులో ఉంచాల్సి ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇందుకోసం కనీసం 400 నుంచి 500 రూపాయలు ఒక్కసారిగే ఖర్చు చేయాల్సి వస్తోంది. తర్వాత చికిత్సల కోసం రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిళ్లు కుక్కకాటుకు గురైతే సమీప పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. లేదా అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపి వైద్యుల వద్ద టిటి ఇంజక్షన్ వేయించుకుని, మరుసటి రోజు రేబిస్ వ్యాక్సిన్‌ను వేయించుకుంటున్న ఘటనలు నిత్యకృత్యమవుతోంది. కుక్కల విచ్చలవిడిగా సంచరిస్తున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుక్కల సంచారాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.