అనంతపురం

పరిశుభ్ర వాతావరణమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, మే 20: వ్యర్థాలు తగ్గించి, పరిశుభ్ర వాతావరణం కల్పించటమే జి.ఓ 279 లక్ష్యమని సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ స్టేట్ లెవల్ అధికారి సాంబమూర్తి తెలిపారు. శుక్రవారం స్థానిక డిఆర్‌డిఎ అభ్యుదయ భవన్‌లో రాయలసీమ రీజియన్ కమిషనర్లు, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్లు, హెల్త్ఫాసర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల సమావేశం జరిగింది. సమావేశంలో మున్సిపల్ ఆర్.డి విజయలక్ష్మి, కమిషనర్ ఓబులేశు తదితరులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుపరచటంతోపాటు పరిసరాల పరిశుభ్రత ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గించాలన్నది ప్రభుత్వాల ఉద్దేశ్యమన్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా వ్యర్థాలను తగ్గించి తిరిగి వాటిని వినియోగంలోకి తీసుకురావటానికి 2000 సంవత్సరంలోనే చట్టం తీసుకువచ్చారన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో 279 జి.ఓను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మే నెలాఖరునాటికి జి.ఓ 279 అమలులోకి తీసుకువచ్చేందుకు మున్సిపాలిటీలలో నోడల్ ఆఫీసర్లను నియమించటం జరిగిందన్నారు. అంతేకాక ఆయా మున్సిపాలిటీలలోని మురుగు కాల్వలు, రహదారుల పొడవు వివరాలను సేకరించి డిఎంఎకు నివేదిక పంపాలని ఆదేశించిందన్నారు. అలాగే మే నెలాఖరునాటికి పారిశుద్ధ్య పనుల నిర్వహణకు టెండర్లు నిర్వహించి జూన్ 1వ తేదీన పనులు చేపట్టేలా కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్లు జారీ చేయాలన్నారు. కమిషనర్ ఓబులేశు మాట్లాడుతూ గడచిన నాలుగు నెలల కాలంలో మున్సిపల్ కార్పొరేషన్‌లో 30 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లకు శిక్షణ ఇచ్చి సర్వే చేయించామన్నారు. ఈ సర్వే 44 డివిజన్లలో పూర్తి చేశారన్నారు. మిగతా ఆరు డివిజన్లలో నాలుగు రోజుల్లో సర్వే పూర్తిచేసి రూట్ మ్యాప్‌తో సహా నివేదిక సమర్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినపుడే మంచి ఫలితాలు సాధించగలమన్నారు. జి.ఓ 279పై సాంబమూర్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ ఆర్‌డి విజయలక్ష్మి మున్సిపాలిటీల వారీగా సమీక్ష జరిపారు. సకాలంలో సర్వే పనులు పూర్తి చేసి జూన్ 1వ తేదీకల్లా వర్క్ ఆర్డర్లు ఇచ్చి పనులు జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆయా మున్సిపాలిటీలలోని నోడల్ ఆఫీసర్లు దీనిపై ప్రత్యేక దృష్టి నిలిపి పనిచేయాలని సూచించారు.