అనంతపురం

దద్దరిల్లిన మున్సిపల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, మే 30:పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల వైఫల్యంపై అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిల్ అధికారులపై ధ్వజమెత్తడంతో కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ భవనంలో మున్సిపల్ చైర్మన్ తులసమ్మ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. మున్సిపాలిటి పరిధిలోని వివిధ ప్రాంతాలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని, పట్టణ ప్రజల తాగునీటి పడరాని పాట్లు పడుతూంటే అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు మాత్రం తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. గుత్తి మున్సిపాలిటికి తాగునీటిని సరఫరా చేస్తే పైపులైన్ పామిడి వద్ద పగిలి పోయిందని, అందుకు అవసరమైన సామాగ్రి లభించకపోవడం వల్ల మరమ్మతు పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని కమిషనర్ కృష్ణమూర్తి వివరించారు. ఆయన వివరణపై సంతృప్తి చెందని అధికార పార్టీ కౌన్సిలర్‌లు సైతం అధికారుల వ్యవహరశైలిపై నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటి పరిధిలో అనేక వార్డులో డ్రైనేజీలో చెత్తచెదారం పేరుకుపోయిందని, వాటిని సకాలంలో తొలగించకపోవడం వల్ల ప్రజలకు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. నిధులు ఖర్చు చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధిపై చూపడం లేదని వారు విమర్శించారు. దీంతో సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు గుత్తి ఆర్‌ఎస్‌లోని మెయిన్ రోడ్డులో షాపింగ్ కాంప్లెక్ మరమ్మతు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్‌బి పురుషోత్తం, కౌన్సిలర్‌లు వరలక్ష్మి, నజీర్, రాజేశ్వరీ పాల్గొన్నారు.