అనంతపురం

వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 30:వర్షా కాలం నేపథ్యంలో రోగాలు పొంచి ఉన్నా యి. రోను తుపాను ప్రభావంతో జిల్లా పలు చోట్ల వర్షాలు పడ్డాయి. గత మూడు రోజుల క్రితం కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల రోగాలు విజృంభించే ప్రమా దం ఉంది. ముఖ్యంగా ప్రజలు విష జ్వరా లు, డయేరియా, మలేరియా, డెంగీ, మెదడు వాపు, ఫైలేరియా, చికు న్ గన్యా తదితర వ్యా ధుల బారిన పడే ప్రమాదం ఉంది. వీటితో పాటు సాధారణ జబ్బు లు జలుబు, దగ్గు లాం టివి చిన్నాపెద్దా తేడా లేకుం డా సోకనున్నా యి. ఈ పరిస్థితులను అధిగమించడానికి తీసుకున్న పలు చర్యలను సోమవారం జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ ఆంధ్రభూమి ఇంటర్వ్యూలో వెల్లడించారు. రానున్న వర్షాకాలంలో రోగాల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అన్ని రకాల మందులతో పాటు ఓఆర్‌ఎస్ పాకెట్లు, ఐవి ఫ్లూయిడ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలోని అన్ని పిహెచ్‌సీలు, సిహెచ్‌సీలు, సబ్ సెంటర్లకు ఇప్పటికే 2 లక్షల ఒఆర్‌ఎస్ పాకెట్లు సరఫరా చేశామన్నారు. డిఎంహెచ్‌ఒ ఆధీనంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు 13000 పాకెట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్షాకాలంలో నీటి కా లుష్యం, మామిడి కాయల కారణంగా ప్రజలు విరేచనాల (డయేరియా) బారిన పడే అవకాశం ఉందన్నారు. నీటి శుద్ధి కోసం క్లోరిన్ ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తామన్నారు. క్లోరోస్కోప్స్ ద్వారా కూడా నీటిని పరీక్షించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో మెదడు వాపు వ్యాధి లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోగాల నియంత్రణకు పంచాయతీ రాజ్, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ వైద్య విభా గం, ఆర్‌డబ్ల్యుఎస్, స్వచ్ఛంద సంస థలు, ఐసిడిఎస్, వలంటీర్ల సమన్వయంతో వైద్యి ఆరోగ్య శాఖ పని చేస్తోందన్నారు. ఏటా ప్రతి పిహెచ్‌సి పరిధిలో రూ.2 లక్షలు, సిహెచ్‌సిల్లో రూ.5 లక్షల మేర మందుల్ని సరఫరా చేస్తున్నామన్నారు. పిహెచ్‌సీల పరిధిలో సంబంధిత వైద్యుడు టీం లీడర్‌గా సిహెచ్‌ఒలు, పిహెచ్ ఒలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్( ఆర్‌ఆర్‌టి)లను ఏర్పాటు చేశామన్నారు. వ్యాధులు ప్రబలిన గ్రామాలకు ఈ టీమ్‌లు సమాచారం అందగానే చేరుకుని వైద్య సేవలు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు డ్‌హెచ్‌ఓ అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ నియంత్రణకు జిల్లాలోని 1003 పంచాయతీలను సాధారణ నిధులు రూ.10 వేలు చొప్పున పంపిణీ చేశామన్నారు. ఈ నిధుల్ని పంచాయతీ సర్పంచ్, ఆశ వర్కర్ ఆధ్వర్యంలో సమష్టిగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. అలాగే లార్వా నిరోధానికి అబేట్ మందు సిద్ధంగా ఉందన్నారు. గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేపడతామన్నారు. పాము కాటుకు యాంటీ స్నేక్ వీనమ్( ఎఎస్‌వి), కుక్క కాటుకు అభయ ర్యాబ్ మందుల్ని అందుబాటులో ఉంచామన్నారు. పాము కాటుకు గురైన బాధితులు 108 వాహన సేవల్ని వినియోగించుకోవాలని కోరారు. ఆ సౌకర్యం అందుబాటులో లేని పక్షంలో 20 నుంచి 30 నిమిషాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి సమాచారం ఇస్తే వెంటనే వైద్య సేవలందించేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. బాధితులు 108 సేవల్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అదనంగా మరో 8 పిహెచ్‌సిలను త్వరలో ప్రారంభిస్తామని డిఎంహెచ్‌ఒ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని పాల్తూరు(విడపనకల్లు), ములకవేముల, కొండాపురం(గోరంట్ల), శ్రీరంగపురం(బెళుగుప్ప), బి.పప్పూరు(నార్పల), రాయలచెరువు, కురుకుంట, గుండుమలలో కొత్త పిహెచ్‌సిలు ఏర్పాటు చేశామన్నారు. వీటికి సంబంధించి వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని కూడా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈ నెల 27న ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్‌సీలు, 586 సబ్ సెంటర్లు, 14 సిహెచ్‌సిలు, జిల్లా ఆస్పత్రి(హిందూపురం), కదిరి, గుంతకల్లు, తాడిపత్రిలోని ఏరియా ఆస్పత్రులు, అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని డిఎంహెచ్‌ఓ వివరించారు.