అనంతపురం

మొక్కలు నాటుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిమర్రి, మే 30: రాష్ట్రంలో ప్రతి గ్రామంలోను ఇంటింటా మొక్కలు నాటి పర్యావరణ అభివృద్ధికి అంద రూ కృషి చేయాలని మండలంలోని నారసింపల్లి(దత్తత గ్రామం)లో డిజిపి జెవి.రాము డు పేర్కొన్నారు. సోమవారం డిజిపి స్వగ్రామమైన నారసింపల్లిలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు చైర్మన్ సంపత్‌కుమార్ ఆచార్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఆర్థిక అక్షరాస్యత, అవగాహన సదస్సుకు రాష్ట్ర డిజిపితోపాటు రాయలసీమ ఐజి శ్రీ్ధర్, కలెక్టర్ కోన శశిధర్, ఎస్‌పి రాజశేఖరబాబు, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం పెద్ద పెద్ద చెట్ల వనాలు వుండేవని, అప్పట్లో వర్షాలు వచ్చి తాగు, సాగునీరు పుష్కలంగా లభించేవన్నారు. పూర్వ సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత కూడా గ్రామీణులకు ఎంతో అవసరమన్నారు. ఇంటింటా మొక్కలు నాటి గ్రామంలో వనాలు పెంచితే పర్యావరణ అభివృద్ధి పెరిగి వర్షాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాల దృష్ట్యా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు శాఖ వారు త్వరలోనే నారసింపల్లిలో శాఖ ఏర్పాటుచేస్తారని పేర్కొన్నారు. మన గ్రామంలో అందరి సహకారంతో ఉన్నతాధికారుల మరింత సహకారంతో అభివృద్ధి సాధించి అందరికి నారసింపల్లి ఆదర్శంగా నిలవడమే తమ ధ్యేయమన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ డిజిపి స్వగ్రామమైన నారసింపల్లిలో అభివృద్ధి పనులు ఎన్నో చేపడుతున్నామని, అలాగే ఈమారు బ్యాంకు సేవలు సైతం గ్రామంలోనే చేపట్టేందుకు తలపెట్టనున్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వారు ఇక్కడ శాఖ ఏర్పాటుచేయడం శుభపరిణామమన్నారు. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయిందన్నారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరి చేయడం, రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకం సైతం కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలను సైతం గ్రామాభివృద్ధికి తోడ్పడేలా ప్రతి ఒక్కరూ విద్యాభ్యాసంపై మొగ్గు చూపాలన్నారు. ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మాట్లాడుతూ నారసింపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఉన్నతాధికారులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని, ప్రభుత్వం తరపున గ్రామానికి రావాల్సిన సంక్షేమం తమవంతు కృషిగా అభివృద్ధికి తోడ్పడతానన్నారు. అనంతరం గ్రామంలోని శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం చుట్టూ వున్న కొండపై డిజిపి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. సుమారు 4 వేల చెట్లతో గ్రామంలో ఇంటింటా చెట్లు పెంచేందుకు అధికారులు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఐజి శ్రీ్ధర్, ఎస్‌పి రాజశేఖరబాబు, ధర్మవరం రూరల్ సిఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ రాంభూపాల్, తహశీల్దార్ రామకృష్ణయ్య, ఎంపిడిఓ నాగరాజు, స్థానిక సర్పంచ్ గొంది బుచ్చమ్మలతోపాటు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు చైర్మన్ సంపత్‌కుమార్ ఆచార్య పాల్గొన్నారు.