అనంతపురం

అంజనీ సుతునకు మల్లెల లక్షార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, మే 30:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలలో బాగంగా సోమవారం అంజనీ సుతుడైన హనుమంతునికి మల్లెల లక్షార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయంలోని మూల విరాట్ ఆంజనేయస్వామికి తెల్లవారుజామున సుప్రభత సేవ, మహాభిషేకం, విశేష పుష్పాలంకరణ, బంగారు కిరీటధారణ, వజ్రకవచాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన వడమాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా స్వామి వారికి అష్టోత్తర కలశాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంకాలం ఆలయ ముఖమండపంలోని స్వామి వారికి లక్ష మల్లెపూలతో అర్చన నిర్వహించారు. ఆలయ వేదపండితులు, ఆలయ ప్రధాన అర్చకులు వసుధారాజాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి వేలాది మంది భక్తులు మల్లెలతో స్వామి వారి అర్చన చేసి అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ ముత్యాలరావు, ఎఇఓ ధనుంజయ, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యురాలు సుగుణమ్మ, ఆలయ సిబ్బంది, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నేడు శోభాయాత్ర :దక్షిణాధి హనుమజ్జయంతిని పురస్కరించుకుని హిందూ ధార్మిక సంస్థలు, భక్తుల ఆధ్వర్యంలో మంగళవారం భక్తుల శోభాయాత్రను నిర్వహించనున్నట్లు భక్తులు తెలిపారు. స్థానిక ఆర్యవైశ్య కుల దైవం వాసవీమాత దేవాలయం నుండి మంగళవారం ఉదయం భక్తులు హనుజ్జయంతిని పురస్కరించుకుని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం వరకు భక్తులు పాదయాత్రగా శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాషాయ జెండాలతో స్వామి వారి భక్తి గీతాలాపనలతో భక్తుల శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం స్వామి వారికి తోమాల సేవ, విశేష పుష్పలంకరణలతో పాటు విశేష ఆభరణాలతో స్వామి వారు కొలువు దీరి భక్తులకు దర్శనమిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాయంకాలం ఉష్ట్ర వాహనంపై కొలువు దీరిన స్వామి వారి ప్రాకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.