అనంతపురం

కరవు సీమలో వజ్రాల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, మే 30: కరవు సీమలో ఉద్యోగ, ఉపాధి వేటతో పాటు వజ్రానే్వషణలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యోగ, ఉపాధు లు కరువైన యువతతో పాటు మహిళలు, వృద్ధులు ప్రస్తుతం కురిసే తొలకరి వర్షాలకు భూగర్భంలో నిక్షిప్తమై వున్న వజ్రాల కోసం వేట సాగిస్తుంటారు. జూన్ మాసం ప్రారంభం లో కానున్న వర్షాలతో పాటు సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలకు భూగర్భంలో వున్న వజ్రాలపై వున్న మట్టి తొలగి, భూ పైపొరలకు చేరుకుంటాయి. దీంతో అనే్వషకులను ఇట్టే ఆకర్షిస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం, ఇందుకు అనుగుణంగా అనేక మార్లు అత్యంత ఖరీదైన వజ్రాలు వజ్రకరూరు ప్రాంతంలో లభ్యమయ్యా యి. భారత ప్రభుత్వం వజ్రకరూరు పరిసర ప్రాంతాలో ఏరియాలో అ త్యంత ఖరీదైన వజ్రనిల్వల ముడి పదార్థాలు కింబర్‌లైట్‌లు ఉన్నాయని, గుర్తించి భూగర్భ వజ్రానే్వషణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కరవు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాలలో వజ్రాలు లభించడంతో పేద కుటుంబాలకు వచ్చిన అరకొర నగదుతో సంతృప్తిని వ్యక్తం చెందుతుంటారు. అదే బాటలో యువకులు సైతం వ జ్రానే్వషణలో తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని వజ్రకరూరు, బోడిసాని పల్లి, కట్టకిందపల్లి, వెంకటాంపల్లి, వెంకటాంపల్లి పెద్ద తండా, జరుట్ల రాం పురం, పామిడి మండలంలోని అ నుంపల్లి, కల్యాణదుర్గంతో పాటు తూముటపల్లి, పిల్లలపల్లి తదితర ప్రాంతాలలో అక్కడక్కడ వర్షాలు పడిన సమయంలో అత్యంత విలువైన వజ్రాలు లభించిన దాఖలాలు ఉన్నాయి. అదే విధంగా గుంతకల్లు మండలంలోని కొంగనపల్లి, పులగుట్టపల్లి, పులగుట్టపల్లి పైతండా, చిన్న తండా తదితర ప్రాంతాలలో అక్కడ కూలీలకు వజ్రా లు లభ్యమయ్యాయి. అనంతపురం జిల్లా సరిహద్దు గుంతకల్లు సమీపంలో గల కర్నూలు జిల్లా పెరవలి, జొన్నగిరి, పగిడిరాయి, తుగ్గలి తదితర ప్రాంతాలకు సైతం జిల్లా నుండే కాక కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన వజ్రానే్వషకులు విచ్చేస్తుంటారు. స్థానికులతో పాటు స్థానికేతరులు సైతం వజ్రం లభించిన సమాచారం అందిన వెంటనే పెరవలి, గుత్తి, వజ్రకరూరులకు చెందిన వజ్రాల వ్యాపారస్తులు తమ వాళ్లతో వారిని పిలిపించుకుని వ్యాపారం కొనసాగిస్తుంటారు. లభ్యమైన వజ్రాన్ని గుట్టుచప్పుడు కాకుండ విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారస్థులు సైతం తృణమో, ఫణమో వారి చేతుల్లో పెట్టి చేతులు అత్యంత ఖరీదైన వజ్రాలను కొనుగోలు చేస్తుంటారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు రోజులుగా ఉరవకొండ వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో కురిసిన వర్షాలకు వజ్రకరూరు పొలాల్లో చిన్న, పెద్ద తేడా లేకుండ పెద్దఎత్తున మహిళలు, చిన్నారులు వజ్రానే్వషణలో దిగారు. దేశంలో మొట్టమొదటి సారిగా వజ్రకరూరులో ఏర్పాటు చేసిన భూ వైజ్ఞానికి వజ్రానే్వషణ కేంద్రాన్ని కేవలం ప్రపంచ దేశాలలోని కేవలం జియలజికల్ సర్వే శిక్షణ కేంద్రంగా మాత్రమే వినియోగించుకుంటున్నారని, శిక్షణ సమయంలో జిల్లాలో వివిధ ప్రాంతాలలో జియాలజికల్ సర్వేలు నిర్వహించి, జిల్లాలో అత్యంత విలువైన కింబర్‌లైట్‌లపై సర్వేలు నిర్వహిస్తుంటారు. వజ్రానే్వషణ కేంద్రంలో ప్రాసెసింగ్ యూనిట్‌లను పునరుద్దరించి, స్తానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.