అనంతపురం

చంద్రబాబు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి టౌన్, మే 30: దక్షిణ భారతదేశంలో అత్యంత వెనుకబడి వున్న అనంతను కరవురహిత జిల్లాగా చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై జిల్లా ప్రజలు విశ్వాసం వుంచి 12 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను టీడీపీ తరపున గెలిపించడం జరిగిందన్నారు. జిల్లాపై ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ వుందని, కరవు రహిత జిల్లాగా మార్చాలని చూస్తున్నారన్నారు. హంద్రీనీవాను పూర్తి చేసి జిల్లాలోని 1263 చెరువులకు నీరును నింపి భూగర్భ జలాలను పెంచడమే టీడీపీ ధ్యేయమన్నారు. హంద్రీనీవాతో జిల్లా రైతులకు ఎంతో మేలు జరిగి సాగు, తాగునీరు సమస్య తీరుతుందన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటల్లో పూడిక తీయించడం, మరమ్మతులు చేయ డం, కొత్తవి నిర్మించడం జరుగుతుందన్నారు. దీనివల్ల వర్షపు నీటి చుక్క భూమిలో ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయని, ఇది జిల్లాకు ఎంతో ప్రయోజనకరమన్నారు. అదేవిధంగా లక్ష 6 వేల ఫారంఫండ్లు తవ్వించి భూగర్భ జలాలు పెరిగేలా చూస్తామన్నా రు. జిల్లా వ్యాప్తం గా 7 లక్షల 50 వేల హెక్టార్లల్లో పంట సాగు చేసి నష్టపోతే రూ.500 కోట్లు, మంచి పంట పండితే రూ.2 వేల కోట్లు వస్తుందన్నారు. అదే పండ్ల తోటలు పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చి 1.44 లక్షల హెక్టార్లల్లో పండ్ల తోటను సాగు చేసిన రైతులకు రూ.3 వేల 800 కోట్లు లాభం వచ్చిందన్నారు. పండ్ల తోటలకు ప్రాధాన్యతనిస్తూ డ్రిప్, స్పింక్లర్లును సబ్సిడీతో ఇస్తున్నామన్నారు. 30 వేల హెక్టార్లకు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. 11 వేల రెయిన్ గన్స్ ఇచ్చి పంట మధ్యలో పంట సంజీవని ద్వారా నీరందించి పంటను కాపాడతామన్నారు. ఎన్‌ఆర్‌జీఎస్ కార్యక్రమం ద్వారా వందల కోట్లు కేటాయించి చంద్రన్న బాట పథకం కింద రోడ్లు వేస్తామన్నారు. అసంఘటిత కార్మికుల కోసం రూ.15ల ప్రీమియంను చంద్రన్న బీమా పేరిట రూ.5 లక్షల బీమాను ఇవ్వడం జరుగుతుందన్నారు. వర్షాకాలంలో విరివిగా మొక్కలను పెంచాలని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడంతోపాటు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా చేసి కరవును పాలదోలుతామన్నారు. ఇదే సందర్భంలో మహానాడులో కరవు రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని విభజన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు 2022 నాటికి దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో రాష్ట్రాన్ని నిలపాలని, 2029కి దేశంలోనే మొదటిస్థానం, 2050కి ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిపేలా చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తుగా భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరడంతోపాటు అమరావతిలో 112 అడుగుల ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. కాగా మహానాడును జయప్రదం చేసిన అందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.