అనంతపురం

జిల్లాలో లక్ష ఫారంపాండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగానపల్లి, మే 30: మండల పరిధిలోని పర్వతదేవరపల్లిలో రైతుల పొలాల్లో ఏర్పాటుచేసిన నీటి కుంటలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సోమవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ గర్భ జలాలు పెంపొందించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా లక్ష ఫారంపాండ్లు నిర్మాణాలను చేపట్టిందన్నారు. పర్వతదేవరపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య పొలంలో నిర్మించిన ఫారంపాండ్ శనివారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా నిండి జల కళను సంతరించుకుంది. దీంతో మంత్రి పరిటాల సునీతతోపా టు డ్వామా పిడి నాగభూషణం, ఆర్‌డిఓ బాలానాయక్‌లు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి రైతు పొలాల్లో నీటి కుంటలు నిర్మించుకుంటే ప్రతి వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టుకోవచ్చునని, దీంతో భూ గర్భ జలాలు వృద్ధి చెంది బోర్లు రీచార్జ్ అవుతాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్క రూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముక్తాపురం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న గోవిందు అవినీతి అక్రమాలకు పాల్పడి ఉపాధి కూలీలకు తెలియకుండా బిల్లులు స్వాహా చేశాడని, వెంటనే విధుల నుండి తొలగించాలని ముక్తాపురం గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే మంత్రి కలుగజేసుకుని అవినీతికి పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్‌పై విచారణ చేసి అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే కాజేసిన సొమ్మును రికవరీ చేసి విధుల నుండి తొలగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివయ్య, ఏపిడి నీలిమ, ఏపిఓ జయమ్మ పాల్గొన్నారు.