అనంతపురం

జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, జూన్ 2 : కరవుకు నిలయమైన మన జిల్లాలో క్రీడలకు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎపి ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జెసి పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఫుట్‌బాల్ మైదానంలో జెసి పవన్ యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడాకారుల పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారన్నారు. వారికి సరైన ప్రోత్సాహం లభించకపోవడం వల్ల సరైన గుర్తింపునకు నోచుకోవడం లేదన్నారు. అయితే తాను రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన తర్వాత జిల్లాలో క్రీడల అభివృద్ధికి రూ.1 కోటి వరకూ ఖర్చు చేసినట్లు వివరించారు. క్రీడల నిర్వహణలో జిల్లా కేంద్రంతో గుత్తి పోటీపడటం శుభపరిణామమన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైతే పెద్ద కంపెనీలతో చర్చించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రతిభను చాటుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు వెంకటశివుడు యాదవ్, మాజీ ఎంపిపి కేఎస్ ఫైరోజ్‌బేగం, టిడిపి నాయకులు రామూయాదవ్, నిర్వాహకులు రవితేజ, అశోక్, 108 శీనా పాల్గొన్నారు.