అనంతపురం

రాష్ట్ర విభజనకు సహకరించిన చంద్రబాబుకు నవనిర్మాణ దీక్ష చేసే హక్కులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దవడుగూరు, జూన్ 2 : రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నవ నిర్మాణ దీక్ష చేసే నైతిక హక్కు లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా మండలంలో పర్యటిస్తున్న జగన్ యాత్ర రెండవ రోజు గురువారం ఉదయం 8 గంటలకు మేడిమాకులపల్లిలో ప్రారంభించి లక్షుంపల్లి, ముప్పాలగుత్తి, బుర్నకుంట, కడదరకుంటపల్లె గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. మద్యాహ్నం 3 గంటలకు కిష్టిపాడు చేరుకుని ఆత్మహత్య చేసుకున్న చేనేత నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారన్నారు. రెండు సంవత్సరాల్లో ఎన్నో మోసాలు చేసి అబద్దాలు చెప్పారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేసిన పాపానపోలేదన్నారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా అడ్డుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీకి అల్టిమేటం ఇచ్చి నిలదీయలేని ఉండటం దురదృష్టకరమన్నారు. నిజంగా చంద్రబాబుకు ప్రభుత్వం చేసిన పనులపై నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు కోరాలని సవాల్ చేశారు. అనంతరం చేనేత కార్మికుడు అన్నం శ్రీరాములు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, తాడిపత్రి నాయకులు విఆర్ రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథ్, కాపు రామచంద్రారెడ్డి మాజీ ఎంపి అనంతవెంకరామరెడ్డి, జిల్లా అధ్యక్షులు శంకర్ నారాయణ, రాప్తాడు ఇన్‌చార్జి ప్రసాద్‌రెడ్డి, నాయకులు గూడురు సూర్యనారాయణరెడ్డి, మండల నాయకులు శరభారెడ్డి, ఎంపిటిసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
యాడికిలో జగన్ రోడ్‌షో...
యాడికి : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా గురువారం మండలంలోని రాయలచెరువు, కుర్మాజీ పేట, రామరాజు పల్లి, తుట్రాలపల్లి, నగరూరు మీదుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుకిరువైపులా బారులు తీరిన ప్రజలకు జగన్ అభివాదం చెబుతూ ముందుకు సాగారు. అనంతరం మండలంలోని నగరూరు గ్రామానికి చెందిన రైతులు కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలను జగన్ పరామర్శించారు.