అనంతపురం

అడ్డగోలుగా రాష్ట్ర విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మనహాల్, జూన్ 3 : అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కష్టాలు తెచ్చిపెట్టిందని చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి కష్టాల్లో ఉన్న సమయంలో ప్రజలు సమర్థుడైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. అప్పటి నుంచి నిద్రహారాలు మాని అహర్నిశలు అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్నలు చూరగొంటున్న చంద్రబాబును చూసి ఓర్వలేకనే జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. అస్యభ పదజాలంతో ప్రజలను రెచ్చగొట్టడం తగదన్నారు. ఆస్తికి మించిన ఆదాయానికి సంబంధించి 9 కేసుల్లో ముద్దాయిగా సిబిఐ కోర్టులో నిలబడుతున్న జగన్ మచ్చలేని నాయకుడు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. అనంతరం స్థానిక ఎల్బీనగర్‌లో గ్రామాలవారీగా జన్మభూమి కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పార్వతి, జడ్పీటీసీ వాణి జగన్నాథ్‌రెడ్డి, రాయదుర్గం మార్కెట్ కమిటి ప్రెసిడెంట్ చంద్రహాస్, కళ్యాణదుర్గం ఆర్డీఒ రామారావు, ఎంపిడిఒ గంగన్న, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పార్టీ కన్వీనర్ చలపతి పాల్గొన్నారు