అనంతపురం

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి/గోరంట్ల, జూన్ 3 : జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. గోరంట్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాందలో వెంకటేశ్వర్లు (56)తోపాటు ఏడాది బాలుడు మృతి చెందాడు. అలాగే రామగిరి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాందలో బాలు(36), లక్ష్మయ్య(40) మృతి చెందారు. స్థానికులు, ఆయా పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామగిరి మండలంలోని చెర్లోపల్లి సమీపంలో గల ఆర్‌డిటి చెక్‌డ్యాం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సోమందేపల్లికి చెందిన బాలు(36), ఇదే మండలం జూలుకుంటకు చెందిన లక్ష్మయ్య(40) వీరిరువురు ముత్యాలంపల్లిలో తన మిత్రుని ఆహ్వానం మేరకు ఓ కార్యానికి హాజరయ్యారు. తిరిగి సాయంత్రం స్వగ్రామానికి వెళుతుండగా చెర్లోపల్లి ఆర్‌డిటి చెక్‌డ్యాం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న సుమోను ఢీకొన్నారు. అతివేగంతో వచ్చి సుమోను ఢీకొట్టడంతో వారిరువురు అక్కడికక్కడే మృతిచెందాడు. రామగిరి సిఐ యుగంధర్, ఎస్‌ఐ శేఖర్‌లు సంఘటనా స్థలానికి వెళ్ళి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇకపోతే గోరంట్ల మండల పరిధిలోని మిషన్‌తండా సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అనంతపురానికి చెందిన వెంకటేశ్వర్లు (56) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన జ్యోత్స్న, శశికళ, విజయకుమార్‌తోపాటు ఏడాది బాలుడిని 108 అంబులెన్స్‌లో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఏడాది బాలుడు మృతి చెందాడు. మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.