అనంతపురం

జగన్ వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూన్ 3:జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్న వైఎస్.జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు మండిపడ్డారు. జగన్‌కు మతిభ్రమించిందని, అతడిని పిచ్చాసుపత్రిలో చేర్చాలని తీవ్రంగా విమర్శించారు. జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో జగన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి,
నగర మేయర్ స్వరూప, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ మొద్దీన్ తదితరులు శుక్రవారం వేరువేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో జగన్ తీరును గర్హించారు.
రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి :ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి
ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించాల్సిన వైఎస్.జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈమేరకు తన క్యాంపు కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడిన ఎమ్మెల్యే, వైకాపా ఎమ్మెల్యేలు పార్టీని వీడి టిడిపిలో చేరుతున్నందున నిరాశ, నిస్పృహలతో జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఇది జగన్ అసలు నైజాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్మతినేలా మాట్లాడటం మంచిది కాదని, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ జగన్‌ను డిమాండ్ చేశారు.
జగన్‌కు మతిభ్రమించింది : నగర మేయర్ స్వరూప
ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌కు పిచ్చి పట్టిందని, ఆయన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని నగర మేయర్ మదమంచి స్వరూప పేర్కొన్నారు. ఈమేరకు నగర టిడిపి ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్‌లో జగన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ తన తండ్రి వయసు కల్గిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల వైఎస్.జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ సంస్కారం కోల్పోయి ప్రవర్తిస్తున్నందునే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారన్నారు. జగన్‌కు ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. ఈకార్యక్రమంలో నగర టిడిపి అధ్యక్ష కార్యదర్శులు గోపాల్, మారుతి కుమార్ గౌడ్, డిప్యూటి మేయర్ సాకే గంపన్న, మార్కెట్ యార్డు చైర్మన్ ఆదినారాయణ, టౌన్‌బ్యాంక్ చైర్మన్ జెఎల్.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
జగన్‌కు మతిభ్రమించింది :గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ మొద్దిన్
వైఎస్.జగన్‌కు మతిభ్రమించిందని, అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ మొద్దిన్ విమర్శించారు. ఈమేరకు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అహర్నిశలు రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబుపై ఇలాంటి వ్యాఖ్యలు తగవన్నారు. ఇలాంటివి పునరావృతమైతే జగన్ యాత్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈసమావేశంలో టిడిపి నాయకులు గోపాల్, రామకృష్ణ, జాఫర్, సుధాకర్, మధుసూదన్, భాను, ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.