అనంతపురం

జిల్లా ప్రథమస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూన్ 6: జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా 5వ రోజు పారిశ్రామిక, సేవా రంగాలలో ప్రగతి, భవిష్య ప్రగతి ప్రణాళికలు అనే అంశపై సోమవారం సదస్సు జరిగింది. మెడికల్ కాలేజి ఆడిటోరియంలో జరిగిన సదస్సులో మంత్రి కామినేని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రాన్ని అశాస్ర్తియంగా విభజించారని, పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించినట్లు ప్రకటించారన్నారు. అదే సమయంలో వెంకయ్యనాయుడు రాజ్యసభలో గట్టిగా పోరాడి కొన్ని డిమాండ్లు రాజ్యసభ ఆమోదం పొందేలా కృషి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ అభ్యున్నతికి అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధికి అలుపెరగకుండా శ్రమిస్తున్నారన్నారు. కృష్ణా నది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 60 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ వుందన్నారు. అయినప్పటికీ రైతులను ఆదుకోవాలనే ధృఢ సంకల్పంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారన్నారు. పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు, రాయలసీమకు నీరు ఇవ్వాలని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా రైతులకు నీరుంటే బంగారం పండించే రైతులున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోది దేశంలో 6 లక్షల ఫారంపాండ్లు నిర్మించాలని పిలుపునిస్తే, జిల్లాలోనే లక్ష ఫారంపాండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే 58 వేల ఫారంపాండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఇందు కు కృషి చేసిన జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలియచేస్తున్నానన్నారు. సంక్షేమ పథకాల అమలులో జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. గత రెండేళ్లలో తల్లీ బిడ్డ మరణాలు జిల్లాలో గణనీయంగా తగ్గాయన్నారు. ఇటీవలే 1400 డాక్టర్లను భర్తీ చేసినట్లు తెలిపారు. ఆసుపత్రులకు కావలసిన వౌళిక వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి మాట్లాడుతూ విభజనతో రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ స్వరూప, ఎస్పీ రాజశేఖరబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రారంభంకాని ఎంసెట్ కౌనె్సలింగ్
* విద్యార్థులు, తల్లిదండ్రుల నిరీక్షణ
అనంతపురం సిటీ, జూన్ 6: జిల్లాలో ఎపి ఎంసెట్ 2016 కౌనె్సలింగ్ సోమవారం నుండి ప్రారంభంకానున్నది. కాని సోమవారం జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూలోను సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆన్‌లైన్ ప్రారంభం కాలేదు. దీంతో ఎంసెట్ కౌనె్సలింగ్‌కు హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు నిరీక్షణ చేసి వెనుతిరగారు. ఎంసెట్‌కు సంబందించిన ఆన్‌లైన్‌కు సర్వర్ పూర్తిగా పనిచేయకపోవడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. కానీ ఆన్‌లైన్ సాయం త్రం 6 గంటల వరకు కూడా పనిచేయకపోవడంతో అధికారులు కౌనె్సలింగ్‌కు హాజరైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేయడంతో వా రు వెనుతిరిగి వెళ్ళిపోయారు. నేడు ఉదయం 9 గంటల నుండి పాలిటెక్నిక్ కళాశాలలో 1వ ర్యాంకు నుంచి 25 వేల ర్యాంకు వరకు విద్యార్థులు హాజరుకావాలి.
రూ.20 కోట్లపంట రుణాల పంపిణీకి చర్యలు
మడకశిర, జూన్ 6:మడకశిర పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రూ.20 కోట్ల పంట రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్టేట్‌బ్యాంక్ రీజనల్ మేనేజర్ విద్యాసాగర్ తెలిపారు. సోమవారం బ్యాం క్ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్‌లో రైతులు పంట సాగు చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ రుణాలు అందిస్తున్నామని, రైతులు జూలై చివరి లోగా పంట రుణాలు రెన్యూవల్ చేసుకుంటే అలాంటి వారి కి ప్రభుత్వం అందించే బీమా సౌ కర్యం వర్తిస్తుందన్నారు. రైతులు సకాలంలో పంట రుణాలు పొంది వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ బ్యాంకులో గృహాల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ నిబంధనల మేరకు రుణాలు అందజేస్తామన్నారు. బ్యాంకులో ప్ర తి వినియోగదారుడు సేవింగ్ ఖా తాలు ఏర్పాటు చేయడంతోపాటు బీమా సౌకర్యం క ల్పించారని, దీన్ని క్రమేణా చెల్లించుకుంటే ప్రమాద బీమా సదుపాయం కలుగుతుందన్నారు. మడకశిర ఎస్‌బి ఐ పరిధిలో ప్రస్తుతం 4 వేల మందికి పంట రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఏమైనా స మస్యలు ఉంటే అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియచేస్తే పరిష్కరిస్తామన్నారు. ఫీల్డ్ ఆఫీసర్ ఆంజనేయులు, అకౌంటెంట్ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలో భారీ వర్షం
* పొంగిపొర్లిన వాగులు
డి.హిరేహల్, జూన్ 6:డి.హిరేహల్ మండలంలో సోమవారం సాయం త్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని డి.హిరేహల్, సోములాపురం, మడినేహళ్లి, జాజూర్‌కళ్లు, కులెకుర్తి, వసగుడ్డం, లింగనహళ్లి గ్రామాలలో వర్షం కురిసింది. వసగుడ్డం గ్రామ సమీపంలోని వాగు వరద నీటితో ప్రవహించడంతో రాయదుర్గం, బళ్లారి రాకపోకలకు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో పొలాల్లో వరద నీరు నిండి పోవడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెళ్లి విరిసింది.
వివాదాస్పదంగా మసీదు నిర్మాణం!
*్భరీగా మోహరించిన పోలీసులు *విధులు బహిష్కరించిన న్యాయవాదులు
తాడిపత్రి, జూన్ 6: స్థానిక నందలపాడులో సోమవారం ఒక వర్గం నిర్మిస్తున్న మసీదును నిర్మించరాదని మరో వర్గం అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీ ఖాశీంసాబ్, అర్బన్, రూరల్ సిఐలు రామకృష్ణారెడ్డి, అస్రార్‌బాషా, పట్టణ ఎస్సైలు రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న వర్గాన్ని శాంతింప జేశారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ చిదానందరెడ్డి, ఎస్సీ, ఎస్టీసెల్ డిఎస్పీ కాశీంసాహెబ్‌లు ఒక వర్గానికి చెందిన మత పెద్దలు అబ్దులైఖాద్రీ, జాఫర్‌మోదిన్, జమాల్, మాబాషా, జిలాన్‌లతోను, మరో వర్గం వారితో చర్చలు జరిపారు. ఈ నెల 9న హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ఇరు వర్గాలు శాంతియుతంగా ఉండాలని ఆదేశించారు.
విధులను
బహిష్కరించిన న్యాయవాదులు
తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఒక వర్గంవారు అక్రమంగా ధర్నా చేపట్టి జడ్జిపై నిందా పూర్వక ఆరోపణలు చేసినందుకు నిరసనగా సోమవారం తాడిపత్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుకుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు.
8న జిల్లాలో మహాసంకల్పం
అనంతపురం కల్చరల్, జూన్ 6: ఈ నెల 8న జిల్లా కేంద్రంతోపాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహాసంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, మండలస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాస్, మంత్రులు పల్లె, సునీత, ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మేయర్ స్వరూప, కలెక్టర్ కోన శశిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా 3 నుండి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయన్నారు. 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో సదస్సులు జరుగుతున్నాయన్నారు. ప్రజ ల సహకారంతో అధికార యంత్రాం గం, ప్రజా ప్రతినిధులు సమైక్యంగా కష్టపడి పనిచేయడం వల్ల కొంతవరకు నిలదొక్కుకున్నామన్నారు. మరిం త అభివృద్ధి సాధించేందుకు లక్ష్యాలను నిర్ణయించుకుని ప్రణాళికలు రూపొందించి అమలుచేయాల్సిన అ వసరం ఉందన్నారు. నియోజకవర్గాల వారీగా ఈ నెల 8న నిర్వహించనున్న మహాసంకల్పం కార్యక్రమంలో నిర్ణయించుకున్న లక్ష్యాల ప్రణాళికలను ప్రకటించి, నిర్దేశించిన సమయంలో లక్ష్యాలను సాధించేలా సంకల్పం తీ సుకోవాలని ముఖ్యమంత్రి దిశ, నిర్దేశము చేశారు. ఇప్పటికే దేశ వృద్ధి రేటు 7.6శాతంకన్నా రాష్ట్భ్రావృద్ధి 10.99 శాతాన్ని సాధించామన్నారు. ఈ యేడాది 15.28 శాతం వృద్ధి రేటు సాధించాలన్నది లక్ష్యమని, ఆ లక్ష్యానికనుగుణంగా ప్ర ణాళికలను రూపొందించి 8వ తేదీన మహాసంకల్పంలో ప్రకటించాలని ము ఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆదాయాన్ని అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. మంత్రి కామినేని మా ట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేలా వౌళిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఎన్‌టిఆర్ వైద్యసేవల పథకం ద్వారా ప్రజలకు వైద్యసేవలందుతున్నాయన్నారు. 102 కాల్ సెంటర్లు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, చంద్రన్న సంచార చికిత్స వాహనాల ద్వారా మంచి ఫలితాలు లభిస్తున్నాయన్నా రు. 190 పట్టణ ఆరోగ్య కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నామన్నారు. ఈ నెల 21న యోగా డేను విశాఖపట్టణంలో నిర్వహించనున్నామని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి స్పంది స్తూ తల్లీబిడ్డల మరణాల శాతం ఎంత వుందని మంత్రిని అడిగారు. యం యంఆర్ 88, ఐయంఆర్ 38 శాతానికి తగ్గిందని మంత్రి వివరించారు.
ప్రభుత్వాస్పత్రిని
తనిఖీ చేసిన మంత్రి సునీత
* సమస్యలపై ఆరోగ్యశాఖ మంత్రితో చర్చిస్తాం
ధర్మవరం, జూన్ 6: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సోమవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వాస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాన్పుల వార్డుకెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆస్పత్రిలో అవినీతికి పలువురు పాల్పడుతున్నారని, డబ్బు ఇవ్వందే పనులు జరగడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ఇందుపై స్పందించిన మంత్రి ఆస్పత్రి సమస్యలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రితో చర్చిస్తామని, సమస్యల పరిష్కారంతోపాటు అదనపు వైద్యుల నియామకానికి కృషి చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సైతం అసెంబ్లీలో పలుమార్లు ఆస్పత్రి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడుతూ ఆస్పత్రిలో అవినీతి రాజ్యమేలుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారని, అందుకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే సస్పెండ్ కాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి చైర్మన్ చమన్‌సాబ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
సాగుదారుల భూముల పరిశీలన
నంబులపూలకుంట, జూన్ 6: సా గుదారుల భూములను క్షేత్ర స్థాయి లో సర్వే చేయడానికి ఉప కలెక్టర్ల ఆద్వర్యంలో ప్రత్యేక బృందాలు సోమవారం పొలాల్లోకి వెళ్ళి సాగుదారుల భూములను పరిశీలించామని ఆర్‌డిఓ వెంకటేసు పేర్కొన్నారు. సోమవారం నుంచి చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ నాయకులు, రైతులు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఒక దశలో తహశీల్దార్ మోహన్‌దాస్‌ను ముట్టడించి వెంటనే సర్వే బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కొందరు రైతులు డిమాండ్ చేశారు. ఆర్‌డిఓ వెంకటేసు మండల తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. రైతులందరిని పిలిపించి మాట్లాడారు. ఆర్‌డిఓ రైతులతో మాట్లాడుతున్న సమయంలో కొందరు సర్వే చేయాలని, మరికొందరు సర్వే వద్దంటూ నినాదాలు చేశారు. సాగుదారుల భూ ములను సర్వే కావాలని ఎంతమంది రైతులు ముందుకు వస్తున్నారో తెలపాలని, అదేవిధంగా సర్వే వద్దని ఎంతమంది రైతులు వున్నారో తెలియచేయాలని రైతులకు తెలిపారు. అక్కడి చేరుకున్న సుమారు 200 మంది రైతులలో ఎక్కువమంది రైతులు క్షేత్ర స్థాయి సర్వే జరపాలంటూ అధికారులకు విన్నవించుకున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న నాయకులకు, రైతులకు సర్వే బృందాలను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రతి రైతు సర్వేకు సహకారం అందించాలని తెలిపారు. సర్వే వద్దన్న వాళ్ళకంటే సర్వే కావాలని కోరుకునే రైతులు ఎక్కువగా వున్నారని, దయచేసి ఆందోళన చేస్తున్న రైతులు సహకరిస్తే బాగుంటుందని నాయకులకు రూరల్ సిఐ రవికుమార్ హెచ్చరించారు. 1156 మంది సాగు రైతుల భూములను సర్వే బృందాలు సర్వే చేస్తాయన్నారు. రైతులు వచ్చి భూములకు సంబంధించిన ఆధారాలను చూపించి పొలాల హద్దులను గుర్తించి సర్వే బృందానికి తెలియచేయాలన్నారు. మొదటి రోజు రాలేకపోయిన రైతులు రెండో రోజు వచ్చి వారి భూములను చూపించవచ్చని ఆర్‌డిఓ రైతులకు తెలియచేశారు. మండలంలో సర్వే చేసే బృందాలకు ఒక్కొక్క బృందానికి నలుగురి పోలీసులను రక్షణగా పంపి బృందాలను క్షేత్రస్థాయికి పంపించారు. వైకాపా నాయకులు షామీర్‌బాషా, రఘునాథ, సర్పంచ్ శ్రీరాములునాయుడు, రెడ్డెప్ప, మాజీ ఎంపిపి సోమిరెడ్డి, అంజనప్పనాయుడు, పాలగిరి బాషా, జయచంద్రారెడ్డి, రూరల్ సిఐ రవికుమార్, పలువురు ఎస్సైలు, సాగు రైతులు పాల్గొన్నారు.
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి

కనగానపల్లి/ ధర్మవరం, జూన్ 6: కనగానపల్లి మండలంలో ఇద్దరు చిన్నారులు సోమవారం సరదాగా ఈతకెళ్ళి మృతి చెందిన సంఘటన తూముచెర్లలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల మేరకు వివరాలు... తూముచెర్ల గ్రామానికి చెందిన మల్లేసు, నిర్మలమ్మ దంపతుల కుమారులైన తేజ(10), తరుణ్(8)లు సోమవారం ఉదయం గ్రామ సమీపంలో ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలాల్లో త వ్విన ఫారంపాండ్లలోకి ఈతకెళ్ళారు. గత వారం రోజుల క్రితం కురిసిన వ ర్షానికి ఫారంపాండ్లలో పూర్తిగా నీరు చేరింది. ఫారంపాండ్లు పూర్తిగా నిండి వుండడంతో గ్రామంలోని తోటి పిల్లలతో కలిసి తేజ, తరుణ్ ఈతకెళ్లారు. అయితే వీరిద్దరికి ఈత రాకపోవడంతో ఊపిరాడక మునిగిపోయారు. ఇది గమనించిన తోటి పిల్ల లు గ్రామంలోని వారికి తెలియజేశారు. స్థానికులు వెళ్ళి మునిగిపోయి న ఇద్దరు పిల్లలను వెలికి తీశారు. అయితే ఆ పిల్లలిద్దరూ అప్పటికే మృతి చెందారన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలిద్దరూ చదువుతున్నారన్నారు. కొడుకులిద్దరూ మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. కనగానపల్లి ఎస్‌ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప్రజలకు తెలపాలి
అనంతపురం సిటీ, జూన్ 6: దేశంలో నరేంద్రమోదీ అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి, వారికి అవగాహన కల్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్రమోదీ రెండు సంవత్సరాల పాలనలోని సంక్షేమ పథకాలపై అవగాహనకై వికాస్ పర్వ్ కార్యక్రమాన్ని స్థానిక లలిత కళాపరిషత్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి జవదేకర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే సత్యనారాయణలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి అంకాల్‌రెడ్డి అధ్యక్షత వహించగా వికాస్ పర్వ్‌ను జ్యోతి వెలిగించి కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని సరిచేస్తూ మోదీ ప్రభుత్వం అవినీతిరహితంగా, అభివృద్ధి దిశగా కృషి చేస్తోందన్నారు. దేశంలోని ప్రతి రైతు ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో జిపిఎ 7.9గా అభివృద్ధి చేశామని తెలిపారు. దేశంలో 2జి పారదర్శకంగా కంపెనీలకు ఇస్తున్నామని, ఎల్‌పిజి గ్యాస్ సబ్సిడీ ఇస్తూ పేద ప్రజలకు అందిస్తున్నామని, మోదీ పిలుపు మేరకు సబ్సిడీని వదులుకున్న 5 కోట్ల మంది ప్రజల సబ్సిడీని 1.2 లక్ష మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్‌ను అందజేస్తున్నామని తెలిపారు. మోదీ ప్రభుత్వం పోలవరం పూర్తి చేయడానికి తెలంగాణాలో కలిపిన పోలవరం ముంపునకు గురైన 7 గ్రామాలను ఏపిలో కలుపుతూ మోదీ తీర్మానం చేశారని తెలిపారు. పోలవరాన్ని తప్పకుండా త్వరితగతిన పూర్తిచేసి రాయలసీమకు నీరు అందిస్తామన్నారు. రైతులకు యూరియాను సబ్సిడీపై నేరుగా ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్‌టిఆర్ వైద్య సేవలకు కేంద్రం నుండి నిధులు విడుదలవుతున్నాయని, ప్రతి యువకునికి పని, ఉద్యోగం కల్పించేందుకు కమ్యూనికేషన్స్, నైపుణ్యాలను పెంపొందించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కేంద్రం సహకరిస్తుందని, ఏపి అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తుందన్నారు. హంద్రీనీవా త్వరితగతిన పూర్తి చేసి రాయలసీమకు నీరు అందిస్తామని తెలిపారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుండి 6 వేల కోట్లు నిధులు విడుదలయ్యాయని, అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు, లోటుబడ్జెట్‌ను, రైల్వే జోన్‌ను, ఏపికి ప్రత్యేక హోదా, ప్యాకేజిలపై కేంద్రం సుముఖతతో ఉందని, కానీ ప్రత్యేక హోదా ఇస్తే ఏపికి అందే నిధులకన్నా ఎక్కువ నిధులు ఇచ్చి ఏపిని ఆదుకుంటుందని తెలిపారు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపిని తీర్చిదిద్దే లక్ష్యంగా బిజెపి పనిచేస్తోందని తెలిపారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరెడ్డి, సుదర్శన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత్‌కుమార్, ప్రతాప్‌రెడ్డి, సాకే బలరామ్, ఎన్‌టి చౌదరి, లక్ష్మిదేవమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దన్న, మహిళా మోర్చా మల్లీశ్వీరీ, జిల్లా నాయకులు ఓలేటి రత్నమయ్య, సుధాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నవ నిర్మాణ దీక్ష!
హిందూపురం, జూన్ 6:తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుండటం, నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవ నిర్మాణ దీక్ష హిందూపురం నియోజకవర్గంలో స్తబ్ధతగా సాగుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో నవ నిర్మాణ దీక్షకు జిల్లాకు చెందిన మంత్రులు కూడా హాజరు కాకపోగా ఉన్నతాధికారులు కూడా ఇటు వైపు కనె్నత్తి చూడకపోవడం గమనార్హం. సినిమా షూటింగ్ కారణంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అందుబాటులో లేకపోగా కనీసం ఆయనకు పార్టీ తరపున ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కనుమూరి శేఖర్ కూడా ఇక్కడ అందుబాటులో ఆ కార్యక్రమానికి లేరు. దీనికి తోడు రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులును కర్నూ లు జిల్లా ఆదోని నియోజకవర్గానికి నవ నిర్మాణ దీక్ష పరిశీలకులుగా నియమించడంతో ఇక్కడ ముఖ్యులు లేకుండానే ఆ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి, ఎంపిపిలు సుభద్రమ్మ, హనోక్, నౌజియాభాను తదితర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇతర నియోజక వర్గా ల్లో ఎమ్మెల్యేలు విస్తృతంగా పాల్గొం టూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజ ల్లో చైతన్యం చేస్తూ రాజధాని నిర్మాణానికి భాసటగా నిలవాలని విన్నవిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు కూడా హిందూపురం నియోజకవర్గంలో జరుగుతున్న నవ నిర్మాణ దీక్షకు ఇంతవరకు హాజరు కాకపోవడంతో నామమాత్రంగా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడ నెలకొన్న రాజకీయ పరిణామాలతో ఎంపి నిమ్మల కిష్టప్ప కూడా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వైపు పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత ఏప్రిల్ 20వ తేదీన చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద జరిగిన రాగమయూరి పరిశ్రమ భూమిపూజ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పాల్గొని వెళ్ళిపోయారు. అప్పటి నుండి హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాలేకపోయారు. ఇటీవల తిరుపతిలో జరిగిన మహానాడు కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు కాగా ఆ సందర్భంలో హిందూపురంలో పర్యటిస్తారని పార్టీ శ్రేణులు భావించగా అక్కడి నుండి అటే వెళ్ళిపోయారు. సినిమా షూటింగ్‌ల కారణంగా బాలకృష్ణ బిజీగా ఉన్నప్పటికీ తెలుగుదేశ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలకు కనీసం ముఖ్య ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయా ల్సి ఉండగా ఈ దిశగా ఎలాంటి దృష్టి లేకపోవడం చర్చనీయాంశమవుతోంది. బాలకృష్ణ ఇక్కడ పర్యటించిన సందర్భాల్లో మాత్రం జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు కొందరు హడావుడి చేస్తూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఆయన దృష్టిలో పడేందుకు ఆరాట పడుతుంటారు. అనంతరం ఎవరికి వారుగా ఉంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఉదాహారణగా లేపాక్షి ఉత్సవాల అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా నవ నిర్మాణ దీక్ష బాలయ్య ఇలాఖాలో స్తబ్ధతగా సాగుతుండటం అటు పార్టీ వ్రేణులను ఇటు ప్రజల్లో ఒకింత విస్మయానికి గురి చేస్తోంది.
మద్యం విక్రయాలపై చర్యలు
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, జూన్ 6:జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వాహకులు మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తే శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.వసుంధర హెచ్చరించారు. సోమవారం స్థానిక కార్యాలయంలో డిసి ఆంధ్రభూమితో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడైనా సరే బెల్టు షాపులు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గత ఏడాది ఎమ్మార్పీ ధరలకు మించి మద్యం విక్రయించిన 22 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేశామన్నారు. గత ఏడాది బెల్టు షాపులకు సంబంధించి 1,117 కేసులు నమోదు చేసి, 1,255 మంది నిర్వాహకుల్ని అరెస్టు చేశామన్నారు. నాటుసారా నిరోధానికి ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది విశేష కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 243 గ్రామాల్లో నాటుసారా(ఐడి)ని నిర్మూలించామన్నారు. మొత్తంగా 97 శాతం మేరకు నాటుసారా జిల్లాలో లేకుండా చేశామని డిసి వివరించారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాను నాటుసారా రహిత(ఐడి ఫ్రీ) జిల్లాగా త్వరలో ప్రకటించబోతున్నామన్నారు. దీనిపై కలెక్టర్‌కు పంపామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ఎక్సైజ్ శాఖాధికారులకు నివేదించామని తెలిపారు. కాగా పదేపదే ఎక్సైజ్ నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 110 సిఆర్‌సిపి కింద 1755 మందిని బైండోవర్ చేశామన్నారు. వీరిలో 26 మంది నిందితుల నుంచి రూ.3.85 లక్షల అపరాధ రుసుం వసూలు చేశామని, మరో ఐదుగురికి జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకున్నామని ఆమె అ న్నారు. కాగా 110 సిఆర్‌పిసి కింద బైం డోవర్ చేసిన నిందితులకు పునరావా సం కల్పించాలని కోరుతూ డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌కు పది రోజుల క్రితం నివేదిక పంపామన్నారు. త్వరలో వారికి పునరావాసం కల్పించనున్నారన్నారు. అనంతపురంలో 105 మంది, గుంతకల్లు 148, గుత్తి 107,తాడిపత్రి 58, ఉరవకొండ 77, శింగనమల 28,కణేకల్లు ముగ్గురు, రాయదుర్గంలో 23 మందిని బైండోవర్ చేశామన్నారు. అలాగే ధర్మవరంలో 183 మందిని, కళ్యాణదుర్గం 139, కంబదూరు 150, సికెపల్లి 39, పెనుకొండ 38, పుట్టపర్తి 61, హిందూపురం 97, కదిరి 168, తనకల్లు 106, మడకశిరలో 147 మంది చొప్పున బైండోవర్ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ వసుంధర వివరించారు. జిల్లాలో ఎక్కడా మద్యం సిండికెట్ కాలేదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా నాగేశ్వరరావు
జిల్లా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఎస్.నాగేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డిసి వసుంధర సమక్షంలో ఆయన విధుల్లో చేరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల్లో భాగంగా తెలంగాణ నుంచి రాష్ట్రానికి ఏసిని కేటాయించారు. హైదరాబాదులో స్టేట్ టాస్క్ఫోర్స్ విభాగంలో పని చేస్తున్న నాగేవ్వరరావును ప్రభుత్వం తొలిసారిగా జిల్లాకు బదిలీపై పంపింది. 1989లో ఎక్సైజ్ సిఐగా విధుల్లో చేరిన ఆయన, ఆరేళ్ల క్రితం అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. కాగా గతంలో రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఆయన పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన అనంతపురం, పెనుకొండ ఎక్సైజ్ ఈ ఎస్‌లు, సీఐలు, ఎస్‌ఐలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సిబ్బందితో సమావేశమయ్యారు. జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా, బెల్టుషాపుల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.