అనంతపురం

కరిబసవ రాజేంద్రస్వామిపై క్రిమినల్ కేసులు ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, జూన్ 7 : పట్టణంలోని కరిబసవస్వామి గవిమఠం మాజీ ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామిపై నమోదైన క్రిమినల్ కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం. రాజేంద్రస్వామిపై గవిమఠంలో జరిగిన అక్రమాల్లో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రాజేంద్రస్వామి ఉరవకొండ మఠానికి చెందిన భూములను బళ్లారి పట్టణంలోని గ్రామీణ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రుణం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2016 జనవరి 2న ఆర్జెసి బ్రమరాంభ ఉరవకొండ గవిమఠంలో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం 2016 ఫిబ్రవరిలో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేశారు. అయితే మఠం ఉత్తరాధికారి ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని ధార్మిక పరిషత్ కమిటి ఎదుట హాజరు కావడంతో అతనిపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ విచారణలో ధార్మిక కమిటీ ఉత్తరాధికారిపై నమోదైన క్రిమినల్ కేసులన్నీ ఉపసంహరించుకోవాలని, యథావిధిగా ఉత్తరాధికారిగా కొనసాగించాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు 2016 మేలో ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో మఠం ఉత్తరాధికారిపై బళ్లారిలోని పోలీసు స్టేషన్‌లో పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.
కమిషనర్ ఉత్తర్వులతో కేసు ఉపసంహరించుకుంటున్నాం
గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి వారిపై బళ్లారి పోలీస్‌స్టేషన్‌లో పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నామని సహాయ కమిషనర్ ఆనంద్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.