అనంతపురం

ప్రజల మద్దతే టిడిపికి శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కణేకల్లు, జూన్ 7 : తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతే శ్రీరామరక్ష అని చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ చిక్కణేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసింది టిడిపినే అన్నారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పేదలకు పింఛన్ ఇచ్చారన్నారు. ఆ మహా నాయకుడి ఆశీస్సులతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 200 వృద్ధాప్య పింఛన్ రూ.1000, వికలాంగ పింఛన్ రూ. 1500కు పెంచారన్నారు. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డంగా విభజించడం ద్వారా అధిక శాతం జనాభా కలిగిన ఎంపికి అధిక అప్పులు, తక్కువ శాతం జనాభా కలిగిన తెలంగాణకు లాభాలు ఇచ్చారన్నారు. ప్రజల ఆశీస్సులు టిడిపికి ఉంటే రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు చూసేవిధంగా చేస్తామన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రహాస్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఎనలేని సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ వన్నారెడ్డి, ఎంపిపి ఫాతిమాబీబీ, వైస్ ఎంపిపి సుజాత, జడ్పీటీసీ శారద, ఎంపిటిసి ఫకృద్దీన్‌సాబ్, సర్పంచ్ కౌసల్య, ఉప సర్పంచ్ ఆనంద్‌రాజ్, ఎంపిడిఒ రెహనాబెగం, వెలుగు కో ఆర్డినేటర్ గంగాధర, ఎఒ శ్రీనివాసులు, టిడిపిఒ పార్వతమ్మ, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.