అనంతపురం

ప్రతి వర్షం నీటి చుక్క నిల్వ చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 9: వర్షాకాలంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకుని నిల్వ చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన సాగునీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు, నీటి పారుదల శాఖ అధికారులతో నగరంలోని మున్సిపల్ అతిథి గృహంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నందున ప్రతి వర్షపు చుక్క వృథా కాకుండా చెరువులు, కుంటలలో నిల్వ చేసుకోవాలని సూచించారు. పని ఇస్తేనే చెరువు వద్దకు పోతాననే భావన నాయకులకు ఉండకూడదన్నారు. చెరువులు, కుంటలకు ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టి పూర్తి చేసుకోవాలన్నారు. చెరువు కట్టలపై ఉన్న కంప చెట్లను వెంటనే తొలగించాలని అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులకు తెలియజేసారు. నీటి సంఘాల అధ్యక్షులు బాధ్యత తీసుకొని ఎవరి పరిధిలో ఉన్న చెరువులను వారు బాగు చేసుకోవాలని తెలిపారు. నీటి సంఘాల పరిధిలో పూర్తికాని సమస్యలు ఏమైనా ఉంటే ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఇంకా చెరువులకు సంబంధించి ఏమైనా మరమ్మతులు ఉంటే వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. రాష్ట్రం విడిపోయి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సిఎం చంద్రబాబు అవసరం అయినన్ని నిధులు మంజూరు చేసి నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని చెరువులకు పూడికలు తీయించి బాగు చేయించారన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సిఎం తపన పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేయాలని, చేసిన పనికి భవిష్యత్తులో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల నీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.