అనంతపురం

అయ్యో..పాపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 9 : దేశాలు దాటుకుని సంతానోత్పత్తి కోసం దశాబ్దాల కాలంగా వస్తున్న విదేశీ అతిథులు పాపం... అర్ధాకలితో చనిపోతున్నాయి. హిందూపురం నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు మండలం వీరాపురానికి ఎర్రమూతి కొంగలు (సైబీరియన్ పక్షులు) ప్రతియేటా విచ్చేస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా పెద్దసంఖ్యలో విదేశీ విహంగాలు సంతానోత్పత్తి కోసం వీరాపురం చేరుకున్నాయి. అయితే గతంలో తరహాలోనే ఆహారం కోసం పక్షులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వర్షాభావ పరిస్థితులతో వీరాపురం చెరువుతోపాటు పరిసర ప్రాంతాల చెరువులు బీటలు వారడంతో గుక్కెడు నీటికి వీరాపురం నుంచి కర్నాటక ప్రాంతానికి వెళ్లి దాహార్తి తీర్చుకునే పరిస్థితి. అయితే ఇటీవల కురిసిన మోస్తరు వర్షాలతో అరకొరగా చెరువుల్లో నీరు చేరినా ఆహారం లభ్యం కాక మృత్యువాతన పడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 25 ఎర్ర మూతి కొంగలు ఆకలి తట్టుకోలేక మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. చెరువుల్లో చేపలు లేకపోవడం, పంట పొలాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఆహారం కొరత పక్షులను కృంగదీస్తోంది. ప్రధానంగా వాటికి ఆహార వనరైన చేపలు లభ్యం కాకపోవడంతో రోజూ మృత్యువాత పడుతున్నాయని వీరాపురం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతియేటా విదేశీ విహంగాలు ఇక్కడికి వస్తాయని తెలిసినా జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో వీరాపురం మర్రిచెట్టుపై పెద్ద సంఖ్యలో ఉన్న విదేశీ విహంగాల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. సంతానోత్పత్తి కోసం వచ్చిన పక్షులు మృత్యువాత పడుతుండటం పట్ల స్థానికులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డల వలే పక్షులను కాపాడుకుంటున్నా అధికార యంత్రాంగం కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల వీరాపురం పరిసర వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రక్షణ చర్యలు తీసుకుని పక్షులను కాపాడాలని కోరుతున్నారు.