అనంతపురం

మోదీ నేతృత్వంలో అభివృద్ధి ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, జూన్ 9 : దేశంలో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో అభివృద్ధి ఉద్యమం చేపట్టినట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఇల్లూరు గోపాలకృష్ణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలోని పని చేసిన ప్రధానమంత్రులు విదేశాలకు అప్పులు కోసం వెళ్లేవారన్నారు. అయితే మోదీ సంస్కరణల వల్ల దేశం అభివృద్ధి చెందుతోందన్నా. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అప్పును రూ, 40 వేల కోట్లను తీర్చారన్నారు. ఇకపోతే ప్రాంతీయ పార్టీల కులతత్వ పార్టీలుగా మారాయన్నారు. రాష్ట్రంలో టిడిపి సైతం ఓ కులానికి సంబంధించిన వారికే ప్రాధాన్యత కల్పిస్తోందని విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికల ఆధారంగా మాత్రమే రాయలసీమ జిల్లాలోని వేరుశెనగ పంటకు ఫసల్ యోజన బీమా పథకంలో లబ్ధి చేకూరలేదన్నారు. ఈ విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి జిల్లా బిజెపి ఆధ్వర్యంలో విన్నవించామని గుర్తు చేశారు. దీన్ని గమణించని కమ్యూనిస్టు పార్టీలు వేరుశెనగ బీమా కల్పించలేదని ఆందోళనలు చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో బిజెపి బలీయమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. ఇందుకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన వికాస్ పర్వ్ కార్యక్రమానికి బిజెపి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడమే అన్నారు. రాష్టవ్య్రాప్తంగా పార్టీ బలోపేతం కార్యక్రమానికి ఈనెల 17న విశాఖలో మండల స్థాయి నుంచి రాష్ట్ర వరకు పార్టీ శ్రేణులు, వివిధ అనుబంధ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బండారు కృష్ణమూర్తి, రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు హరిహరనాథ్, బిజెవైఎం జిల్లా అధ్యక్షులు హరీష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి శేఖన్న, పట్టణ అధ్యక్షులు పట్నం రామాంజినేయులు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రామాంజినేయులు, నాయకులు కొలిమి రామాంజినేయులు, నాయకులు గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.