అనంతపురం

చిట్‌ఫండ్ కంపెనీ కుచ్చుటోపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 10 : సకాలంలో చీటీదారులకు డబ్బు చెల్లిస్తామని నమ్మబలికి నెలలు గడిచినా చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తూ కుచ్చుటోపీ పెట్టబోయిన ఓ చిట్‌ఫండ్ కంపెనీపై బాధితులు శుక్రవారం నగరంలోని టూ టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని సాయినగర్ ఐదో క్రాస్‌లోని ప్రత్యూన్ ఎన్‌క్లేవ్‌లో భావన చిట్‌ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని నిర్వహిస్తున్నారు. నగరంతోపాటు ధర్మవరం, హిందూపురంలో వీరి శాఖలు ఉన్నాయి. ఇటీవల హిందూపురంలోని ఈ సంస్థ బ్రాంచిలో నెలకొన్న అవకతవకలపై చీటీదారులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో సీజ్ చేశారు. తాజాగా అనంతపురంలోని మరో బ్రాంచిపైనా బాధితులు ఫిర్యాదు చేయడంతో సంబంధిత శాఖ మేనేజర్ సి.చిక్కనయ్య, సీనియర్ మేనేజర్ మహేశ్వరరెడ్డి, ఇతర సిబ్బందిని శుక్రవారం అరెస్టు చేసి టూటౌన్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నగరంలోని బోయవీధిలో నివాసం ఉంటున్న కె.శివ, విద్యుత్ నగర్ సర్కిల్‌లో ఉంటున్న డెంటల్ సర్జన్ రాంబాబుతో పాటు పలువురు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వీరికి ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో పాటు చిట్ ఎత్తిన తర్వాత నెలల తరబడి జాప్యం చేయడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. కాగా ఇదే శాఖకు చెందిన హిందూపురంలోని బ్రాంచిలో కూడా గతనెల బాధితులు మోసపోయామని కేసులు పెట్టిన విషయం విధితమే. తాను రూ.5లక్షలకు చిట్ వేశానని, అన్ని నిబంధనలు పూర్తి చేశాక 32వ నెల(28-12-2015)లో చిట్ ఎత్తానని, రూ.3.50 లక్షలకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని బాధితుడు కె.శివ వాపోయాడు. అలాగే ఈ ఏడాది మార్చి 9వ తేదీ మరో రూ.78వేలకు ఇచ్చిన చెక్ సైతం బౌన్స్ అయిందన్నారు. తనకు మొత్తం రూ.4.28 లక్షలు రావాల్సి ఉందని, వడ్డీ ఇస్తామని చెప్పి చెల్లించకుండా జాప్యం చేయడంతో విధిలేక పోలీసుల్ని ఆశ్రయించానన్నాడు. మరో బాధితుడు సాకే రాంబాబు 2014 జూన్ నెలలో రూ.5 లక్షలు చిట్ వేశారు. 2015 అక్టోబర్ 15న చిట్ ఎత్తారు. మార్చికి పోస్ట్‌డేటెడ్‌గా ఇచ్చిన రూ.2.89 లక్షల చెక్ బౌన్స్ అయింది. గత రెండు నెలల నుంచి అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తామంటూ తిప్పుకుంటూ కంపెనీ సిబ్బంది వేధింపులకు గురి చేశారు. యాక్షన్ తేదీ వచ్చిన ప్రతినెలా రూ.10వేలు చొప్పున ఇస్తూ ఇబ్బంది పెట్టారని, తనకు ఇంకా రూ.1.30 లక్షలు రావాల్సి ఉందని వాపోయారు. బ్రాంచి మేనేజర్ సి.చిక్కనయ్య తన భార్యను ఏజెంటుగా నియమించారని, ఆమె ద్వారానే చిట్ వేశానని బాధితుడు కె.శివ అన్నారు. వీరితో పాటు మరికొందరు బాధితులు సైతం పోలీసు స్టేషన్‌కు వచ్చి పోలీసులకు వివరాలు ఇచ్చారు. భావన చిట్‌ఫండ్ కంపెనీ ఎండి లోకనాథాచారి, ఆ సంస్థ చైర్మన్ బేతంచర్ల ఆదినారాయణ(ఖమ్మం)పైనా బాధితులు ఫిర్యాదు చేశారు. సీనియర్ మేనేజర్ మహేశ్వరరెడ్డి ఆంధ్రభూమితో మాట్లాడుతూ చీటీదారులకు ఈనెల 25వ తేదీ వరకు గడువు అడిగామని చెప్పారు. రూ.42 లక్షలు చెల్లింపులు ఉన్నాయని, ప్రతినెలా చిట్ ఎత్తిన వారినుంచి రూ.25 లక్షలు వసూలు కావాల్సి ఉందని వివరించారు. అనంతపురం రిజిస్ట్ఫ్రాసులో రూ.15 లక్షలు ఎఫ్‌డిఆర్ (కస్టమర్ సెక్యూరిటీ డిపాజిట్) ఉందన్నారు. కాగా సాయినగర్ బ్రాంచిలో రూ.లక్ష గ్రూపులు రెండు, రూ.2 లక్షల మొత్తానికి రెండు గ్రూపులు, రూ.5 లక్షలవి మూడు, రూ.10 లక్షలకు ఒక గ్రూపును నడుపుతున్నట్లు తెలిపారు. కంపెనీకి రావాల్సి సొమ్ము చీటీదారుల నుంచి అందకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరిగిందని సిబ్బంది పోలీసులకు వివరణ ఇచ్చారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.