అనంతపురం

విరివిగా మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, జూన్ 10:ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటినపుడే అనంతపురం జిల్లాను హరిత అనంతపురంగా మారుతుందని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మైనారిటీ కాలనీలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ కోన శశిధర్‌లు హాజరయ్యారు. ముందుగా మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ కోన శశిధర్‌లు మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. అనంతరం వారు మాట్లాడుతు జిల్లాలో మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలని, ప్రతి వ్యక్తి 3మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోను రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరత్రా మైదానాలు, విద్యాలయాల్లో మొక్కలు నాటడం ఉద్యమంలా జరగాలన్నారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా మొక్కల పెంపకంలో పూర్తి కావాలని, దీనికోసం మనమందరం కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎక్కువగా చొరవ తీసుకుని ఈ మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. అదేవిధంగా జిల్లాలో కోటి మొక్కల పెంపకం కార్యక్రమం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. వీటి కోసం ప్రత్యేకంగా నర్సరీలను ఏర్పాటు చేశామని, ఒక్కొక్క నర్సరీలో 2లక్షల మొక్కలు పెంచుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ బాలానాయక్, డిఎఫ్‌ఓ చంద్రశేఖర్, ఎంపిపి దగ్గుబాటి ప్రసాద్, సర్పంచ్ వెంకటరాముడు, ఈఓఆర్‌డి సుమలత, వైస్ ఎంపిపి గవ్వల పరంధామ, ఏఓ అరుణ్‌కుమార్ తదితర నాయకులు, శాఖల అధికారులు పాల్గొన్నారు.