అనంతపురం

దొంగల అరెస్టు... బంగారు నగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి, జూన్ 28: ఇద్దరు చోరులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 95 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ధర్మవరం డిఎస్‌పి వేణుగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను డిఎస్‌పి వెల్లడించారు. కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన ఉపేంద్రగుప్త అనే వ్యాపారి ఇంటిలో ఫిబ్రవరి 10వ తేదీన చోరీ చేయడం జరిగిందన్నారు. పని నిమిత్తం వ్యాపారి 10 రోజులపాటు బయటకు వెళ్ళడంతో ఆ ఇంటిలో పనిచేస్తున్న కోనప్ప, అతని మిత్రుడు వెంకటరెడ్డిలు తలుపులు బద్దలుకొట్టి ఇంటిలో వున్న ఆభరణాలను చోరీ చేయడం జరిగిందన్నారు. కనగానపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 14వ తేదీన బాధితుడు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా మంగళవారం కనగానపల్లి మండలం మామిళ్ళపల్లిలోని సబ్ స్టేషన్ వద్ద వీరిరువురు అనుమానంగా సంచరిస్తున్నారని రామగిరి సిఐ యుగంధర్‌కు సమాచారం అందిందన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బహిర్గతమైందన్నారు. నిందితులను ధర్మవరం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణానాలను కోర్టుకు అప్పజెప్పడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎస్‌ఐలు మహమ్మద్ రఫి, రామారావు, పోలీసు సిబ్బంది వున్నారు.