అనంతపురం

నదుల అనుసంధానం సీమకు వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూలై 7 : రాష్ట్రంలో నదుల అనుసంధానం రాయలసీమకు వరమని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న అన్నారు. గురువారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా, కాంగ్రెస్ పార్టీలు పట్టిసీమ ప్రాజెక్టును ప్రభుత్వం మోసం చేయడానికి అంటూ ప్రచారం చేస్తున్నాయన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు వారి మాటలను పట్టించుకోకుండా ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందించారన్నారు. దీంతో ఆయా పార్టీలకు మాట్లాడేందుకు నోరు లేకుండా పోయిందన్నారు. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించడం ద్వారా త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా హంద్రీనీవాకు నీరు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో రాయలసీమ సస్యశ్యామలం కావడంతోపాటు గాలేరు, నగరి ప్రాజెక్టుల ద్వారా సాగు, తాగునీరు అందుతాయన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ చంద్రబాబు ఎంతో అంకితభావంతో ప్రజా సంక్షేమానికి పాటు పడుతున్నారన్నారు. కాగా నియోజకవర్గంలో 146 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి రూ.16.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే నిర్మాణాలు పూర్తి కానున్నట్లు తెలిపారు. అలాగే ఎంపిజిఎస్‌వై, నాబార్డుల కింద ఐదు మండలాల్లో వివిధ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు శ్రీనివాసమూర్తి, పాండురంగప్ప, నాయకులు లక్ష్మినరసింహరెడ్డి, పాండురంగప్ప, భోజప్ప, రామకృష్ణయాదవ తదితరులు పాల్గొన్నారు.