అనంతపురం

సమాజంలో మీడియా పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూలై 10: సమాజంలో మీడియా పాత్ర అమోఘమని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బాలాజీ డిగ్రీ కళాశాలలోని జిల్లా జర్నలిస్టులకు సమగ్ర బీమా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి, అనంత అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, నగర మేయర్ స్వరూపలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మీడియా ఒక వారధిలాంటిదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల కష్ట నష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీడియా కృషి ఎనలేనిదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,500 మంది జర్నలిస్టులకు, 350 మంది డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అక్రిడిటేషన్లను మంజూరు చేసిందన్నారు. ఇంకా ఎవరైన మిగిలి వుంటే అర్హత కలిగిన వారిని గుర్తించి అక్రిడిటేషన్లను త్వరలో మంజూరు చేయాలని అధికారులందరికీ ఆదేశాలిచ్చామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. జర్నలిస్టుల వృత్తి ఒత్తిడితో కూడుకున్నదని, వారిని ఆరోగ్యవంతులుగా చేసేందుకు ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా 4,520మందికి హెల్త్ కార్డులను మంజూరు చేసిందన్నారు. అలాగే 11,502మంది జర్నలిస్టులకు సమగ్ర బీమా పాలసీ అందించామన్నారు. ఇందులో జర్నలిస్టులు 198 రూపాయలు చెల్లించి 10 లక్షల బీమాను పొందవచ్చునని తెలిపారు. చంద్రన్న బీమా పథకంలో 15 రూపాయలు చెల్లించి జర్నలిస్టులు సభ్యత్వ ం తీసుకోచ్చునన్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ఎస్పీ కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సమాజాభివృద్ధిలో నిరంతరం పాటుపడే జర్నలిస్టులందరికి ఇళ్ల పట్టాలను అందిస్తామన్నారు. ఇప్పటికే ఇళ్ల స్థలాలున్న జర్నలిస్టులు కాలనీలకు ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డులను నిర్మిస్తామన్నారు. అధునాతన సాంకేతిక విజ్ఞానం, శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, మీడియా సోదరులు దీన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేసి వారికి అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర ప్రధానమైందన్నారు. జిల్లా కేంద్రంలో శిల్పారామం వద్ద 65మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, అక్కడ మరికొంతమందికి ఇచ్చి మోడల్ కాలనీగా చేస్తామని తెలిపారు. అనంతరం పాత్రికేయులకు 688 మందికి సమగ్ర బీమా కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ ఆదినారాయణ, నరగ ఉప మేయర్ సాకే గంపన్న, సమాచార శాఖ ఎడి తిమ్మప్ప, డివిజనల్ పిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, ఎపిఆర్‌ఓ రమేష్, పాత్రికేయులు పాల్గొన్నారు.