అనంతపురం

స్మార్ట్ పల్స్ సర్వేకు తప్పని బాలారిష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 10 : దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) కార్యక్రమానికి జిల్లాలో మూడో రోజూ ఆదివారం సాంకేతిక సమస్య వెంటాడింది. జిల్లావ్యాప్తంగా 2309 ఎన్యుమరేషన్ బ్లాకుల్లో 11 లక్షల 14 వేల కుటుంబాల్లో వివరాల సేకరణకు స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభించారు. అయితే తొలిరోజు శుక్రవారం ఒక్కో ఎన్యుమరేషన్ బ్యాకులో ఎన్యుమరేటర్లు పదుల సంఖ్యలో కుటుంబాల్లో మాత్రమే సర్వే చేశారు. మొత్తం 83 అంశాలు ఉండటంతో ఒక్కో కుటుంబానికి గంట సమయం కేటాయించాల్సి వస్తోంది. దీనికి తోడు సర్వర్‌తో పాటు ఆధార్ అనుసంధానించే సర్వర్ మొరాయిస్తోంది. దీంతో ఎన్యుమరేటర్లు ట్యాబ్‌ల నుంచి వివరాలను అప్ లోడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. అంతేగాకుండా చాలాగ్రామాల్లో నెట్‌వర్క్‌లు అందుబాటులో లేకపోవడం, మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ అసలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా స్మార్ట్ సర్వే మందకొడిగా సాగుతోంది. అలాగే 20 రకాల వివరాలకు సంబంధించి సమాచారం, ఐడి కార్డులు అందుబాటులో ఉంచుకోకపోవడం, అక్కడక్కడా కుటుంబ సభ్యులు సైతం సమయానికి లేకపోవడం వంటి కారణాలతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలతో పాటు సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు మూడో రోజు ఆదివారం సైతం కొనసాగాయి. దీనికితోడు గ్రామాలు, పట్టణాలు, నగరంలో ప్రజా సాధికార సర్వేపై విస్తృత ప్రచారం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఏయే గ్రామాల్లో ఏ రోజు సర్వే చేస్తారన్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలియడం లేదు. దీనికి తోడు సర్వే కారణంగా భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న ఆంలోభ సైతం ప్రజల్లో ఉంది.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
సర్వే కార్యక్రమాన్ని మున్సిపాలిటీల్లో కమిషనర్లు, రెవెన్యూ డివిజన్లలో ఆర్‌డిఓలు, మండల స్థాయిలో తహశీల్దార్లు రోజూ పర్యవేక్షిస్తూ సమీక్షించాల్సి ఉంది. అయితే ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఎక్కడికక్కడ ఎన్యుమరేటర్లు సర్వే వివరాలను ట్యాబ్‌ల ద్వారా సర్వర్‌కు అప్‌లోడ్ చేస్తున్నందున ఏ రోజుకారోజు వివరాలు తహశీల్దార్లతో పాటు ఆర్‌డిఓ వద్ద కూడా అందుబాటులో ఉండటం లేదు. ఎన్యుమరేటర్లే ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తున్నందున కోర్‌డ్యాష్ బోర్డులో వివరాలు ఉంటాయని కొందరు దాట వేస్తున్నారు. ఈ సర్వేకు జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఏ రోజు ఎన్ని కుటుంబాలను సర్వే చేశారు? ఎంత మంది కుటుంబ సభ్యులు వివరాలు నమోదు చేశారన్న వివరాలు ఒకరిద్దరు ఆర్‌డిఓల వద్ద తప్పితే మిగతా వారి ఇద్దరు అందుబాటులో లేన్నట్లు తెలుస్తోంది. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లో 248 మంది ఎన్యుమరేటర్లకు మూడు రోజులుగా 88 మంది 325 కుటుంబాల్లో సర్వే చేశారు. మొత్తం 845 మంది కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేశారు. ధర్మవరం మున్సిపాలిటీలో 21 మంది ఎన్యుమరేటర్లు 60 కుటుంబాల్లో సర్వే చేసి 176 మంది సమాచారం పొందుపర్చారు. ఆదివారం 60 మంది ఎన్యుమరేటర్లు 268 కుటుంబాల్లో 550 మంది వివరాలు నమోదు చేశారు. పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో మూడు రోజుల్లో కేవలం 80 కుటుంబాల్లో సర్వే చేసి 260 మంది వివరాలు మాత్రమే ట్యాబ్‌ల ద్వారా సేకరించి నమోదు చేశారు. కదిరి రెవెన్యూ డివిజన్‌లో పూర్తి స్థాయిలో అధికారులు ఈ సర్వేపై సమీక్షించడం లేదు. అనంతపురం డివిజన్‌లో తహశీల్దారు, ఆర్‌డిఓ, మున్సిపల్ కమిషనర్లు రోజువారీ విధుల్లో బిజీగా ఉండిపోయారు. కళ్యాణదుర్గం డివిజన్‌లో ఆర్‌డిఓ, ఇతర అధికారులు మంత్రి పల్లె రఘునాథరెడ్డి కార్యక్రమాల్లో ఉండిపోయారు. కాగా నెట్‌వర్క్ లేని ప్రాంతాలు, గ్రామాల్లో 3జి, లేదా 4జి సామర్థ్యాన్ని ట్యాబ్‌లకు అనుసంధానించడం ద్వారా సర్వే వివరాలను సర్వర్‌కు అప్‌లోడ్ చేసే అవకాశం ఉందని జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణాధికారులకు సూచించినట్లు సమాచారం. శాస్ర్తియంగా సాంకేతికతను ఉపయోగించి నిర్వహిస్తున్న స్మార్ట్ పల్స్ సర్వే విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారుల పర్యవేక్షణకు జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే...