అనంతపురం

కేంద్రాన్ని తాకిన అపెరల్ పార్క్ వివాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మార్చి 26 : రూ.కోట్ల వ్యయంతో వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని ఏర్పాటు చేసిన అపెరల్ పార్క్ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడం, పెద్ద ఎత్తున సబ్సిడీ సొమ్ము దిగమింగారన్న ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. అపెరల్ పార్క్‌పై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం విధితమే. అంతేగాకుండా షేర్ హోల్డర్లుగా చేరి రూ.లక్షల్లో నష్టపోయిన కొందరు సభ్యులు సైతం ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. వీటికితోడు అపెరల్ పార్క్ అక్రమాలపై ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో పెద్ద ఎత్తున శీర్షికలు సైతం ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో గత నవంబర్ 18న రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ పెనుమాక నరేష్ ఇక్కడికి విచ్చేసి విచారణ చేసి ఎట్టి పరిస్థితుల్లో అపెరల్ పార్కును నిర్వహించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ కమిషనర్, సీనియర్ ఐఎఎస్ అధికారిణి సరితా గుప్త నేతృత్వంలో ఆదివారం సమగ్ర విచారణ నిర్వహించనున్నారు. సరితా గుప్తతోపాటు రాష్ట్ర, జిల్లా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. దీనికి తోడు అపెరల్ పార్క్‌కు సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా బ్యాంక్ ఉన్నతాధికారులు కూడా విచారణకు హాజరవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కాగా జౌళి పరిశ్రమకు అనువుగా ఉంటుందన్న సదుద్దేశం, ఎగుమతులకు బెంగళూరు విమానాశ్రయం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఇక్కడ టెక్స్‌టైల్ పరిశ్రమలు అభివృద్ధి చెందేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని 2004లో అపెరల్ పార్కును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పార్కు ద్వారా 10 వేల మందికి ఉపాధి, కల్పిస్తామని కాగితాల్లో ప్రణాళికలను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. 2008 అక్టోబర్ 13న పార్క్ నిర్మాణ పనులకు అప్పటి మంత్రులు శంకుస్థాపన చేసి వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అప్పటి నుండి పార్క్ ఏర్పాటుకు విడతల వారీగా కేంద్రం నుండి సబ్సిడీలు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రుణాలు మంజూరయ్యాయి. దీనికి తోడు షేర్ హోల్డర్ల మూలధనం జమైంది. దాదాపు రూ.50 కోట్లకు పైగా నిధులు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మొదటి నుండి టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కొందరి చేతుల్లోనే ఉండటం, పారదర్శకత లేకపోవడం తదితర కారణాలతో తూతూమంత్రంగానే నిర్మాణ పనులు సాగించారు. యంత్రాల కొనుగోలుకు థాయిలాండ్, సింగపూర్, మలేషియా, చైనా వంటి దేశాలకు కొందరు డైరెక్టర్ల బృందం వెళ్లింది. అయితే విదేశాల నుంచి కోట్ల రూపాయలు వెచ్చించి తీసుకొచ్చిన అత్యాధునిక యంత్రాలు ఏ రోజూ నడిపించిన దాఖలాలు లేవు. దీనికి తోడు సబ్సిడీ విడుదల కోసం ముద్దిరెడ్డిపల్లికే చెందిన ఓ వ్యక్తికి ఈ పార్కులో వస్త్రాల తయారీకి డైరెక్టర్లు అనధికారికంగా అనుమతి ఇవ్వగా కొంతకాలం నడిపిన తర్వాత తనకు అధికారికంగా లీజుకు ఇస్తే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, లేకపోతే తప్పుకుంటానని స్పష్టం చేశారు. అయితే నిబంధనల ప్రకారం ఇతరులకు లీజుకు ఇచ్చే అధికారం లేకపోవడంతో చేతులెత్తేశారు. దీంతో ఆయనా తప్పుకోవడంతో పార్కు పూర్తిగా మూతబడింది. బ్యాంక్ రుణాలు చెల్లించాలంటూ అధికారులు ఒత్తిళ్లు తేవడంతో డైరెక్టర్ల నడుమ విభేదాలు ఏర్పడి ఎవరికి వారే యుమునా తీరుగా మారారు. ఏకంగా కేంద్ర కమిషనర్ ఇక్కడికి విచారణకు విచ్చేస్తుండటం అటు అపెరల్ పార్క్ డైరెక్టర్లలోనూ ఇటు జిల్లా అధికార యంత్రాంగంలో గుబులు రేకెత్తిస్తోంది.

జగన్ తీరు నచ్చకే పార్టీని వీడుతున్నారు..
* ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్

ఉరవకొండ, మార్చి 26 : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరు నచ్చకే పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రాష్ట్భ్రావృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి, పట్టిసీమ ద్వారా సాగు, తాగునీరు అందిస్తామన్నారు. అయితే జగన్‌తోపాటు ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు రోజూ అనవసర రాద్ధాంతం చేస్తూ అభివృద్ధికి అడ్డు తగులుతున్నారన్నారు. జగన్ తీరును మార్చుకోవాలని సూచించారు. అత్యంత వెనకబడిన రాయలసీమ ఏడారి కాకుండా భూగర్భ జలాలు పెంచేందుకు వర్షం నీటిని నిల్వ చేయడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం అందించి సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. పట్టిసీమ పనులు చెప్పిన సమయం కంటే ముందుగానే పూర్తి చేసిన ఘనత టిడిపికి దక్కుతుందన్నారు. రానున్న వర్షాలతో గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌కు మళ్లించేందుకు చర్యలు చేపడుతామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్ట్‌లోని 9వ లిఫ్ట్ పనులు పూర్తయ్యయన్నారు. రెండవ దశ పనులు పూర్తి చేయడానికి టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన హెచ్చెల్సీ ఆధునీకరణ పనులు చేపడుతున్నామన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు పురుషోత్తం, ఎంపిపి సుంకరత్నమ్మ, శంకరప్ప, రామాంజినేయులు, లత్తవరం గోవిందు, మండల కన్వీనర్ భాస్కర్, కేశన్న, విజయలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు.