అనంతపురం

హనుమద్ వాహనంపై పాండురంగడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, జూలై 17: శ్రీ విఠోబా స్వాములవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమాన్ వాహన సేవలో శ్రీ పాండురంగస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రంగ సుభేఫిర్కా భగవాన్‌దాస్ దేవాలయంలో ప్రత్యేక పూజలను చేపట్టిన అనంతరం శ్రీ పాండురంగ స్వామిని హనుమాన్ వాహనంలో పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు. వాహన సేవల్లో పాల్గొంటున్న భక్తజనమంతా కోరిన వరాలను ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతుండటంతో మంగళ వాయిద్యాలతో తమ ఇళ్ల ముంగిటకే వస్తున్న శ్రీ పాండురంగస్వామిని ప్రజలు దర్శించుకుంటూ పూజలను చేపడుతూ తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ టి.టి.రమణ్‌రావు, శ్రీ రంగ సుభేఫిర్కా భగవాన్‌దాస్ దేవాలయం, శ్రీరంగ సుభేఫిర్కా భావసార క్షత్రీయ సమాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.