అనంతపురం

క్రీడల ఖిల్లా కణేకల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కణేకల్లు, జూలై 17 : జిల్లాలోని మారుమూల ప్రాంతం, కర్ణాటక సరిహద్దులో ఉన్న కణేకల్లు మేజర్ గ్రామ పంచాయతీకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరుస్తుండడంతో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. మండల స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పేరుప్రఖ్యాతలు తెస్తున్నారు.
స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు క్రీడాకారులు త్రోబాల్‌లో రాణించడంతోపాటు అథ్లెటిక్ 5కె రన్, అండర్-14 సాఫ్ట్‌బాల్ ఇంటర్‌నేషనల్ మలేషియాలోని కౌలాలంపూర్‌లో క్రీడాకారుడు షాకీర్ రాణించాడు. ఈ పోటీలో ఇతడికి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు లభించింది. అలాగే సౌత్‌జోన్ సీనియర్ సాఫ్ట్‌బాల్‌లో జాతీయ స్థాయిలో 13 మంది పాల్గొన్నారు. అదేవిధంగా రాష్టస్థ్రాయిలో క్రికెట్‌లో ఇద్దరు, ఫుట్‌బాల్‌లో నలుగురు, త్రోబాల్‌లో పదిమంది, బేస్‌బాల్‌లో ఇద్దరు, సాఫ్ట్‌బాల్‌లో 30 మంది, అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయిలో ఐదుగురు క్రీడాకారులు పాల్గొన్నారు. గా, రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న విద్యార్థులు 120 మంది పాల్గొన్నారు. ఇకపోతే 2011-12 సంవత్సరంలో రాయదుర్గంలో జరిగిన 5వ జోన్ సైనానెహ్వాల్ గ్రిగ్స్ టోర్నమెంట్‌లో ఆల్‌రౌండర్ ఛాంపియన్‌షిప్ సాధించారు. జిల్లాస్థాయిలో జరిగిన కపిల్‌దేవ్ సెంట్రల్‌జోన్ గ్రిగ్స్ టోర్నమెంట్ ఆల్‌రౌండ్ ఛాంపియన్‌షిప్‌గా గెలిచింది. ఈ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఆర్‌జెడి, డిఇఓ, ఆర్‌ఐటిఇతో క్రీడా ప్రతిభ అవార్డు పొందారు. 2014-15లో కణేకల్లు క్రీడా మైదానంలో జరిగిన 5వ జోన్ గ్రిగ్స్‌లో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల అల్‌రౌండ్ ఛాంపియన్‌షిప్ సాధించింది. అదేవిధంగా ధర్మవరంలో జరిగిన కపిల్‌దేవ్ సెంట్రల్‌జోన్ జిల్లా స్థాయి గ్రిగ్స్ పోటీల్లో ఆల్‌రౌండ్ ఛాంపియన్‌షిప్ సాధించింది. అదేవిధంగా 2014-15 సంవత్సరంలో జోన్ స్థాయిలో, సెంట్రల్ జోన్‌లో క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో డిఇఓ, ఆర్‌ఐటిఇ, రైట్‌తో క్రీడా ప్రతిభ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా 2014-15లో ఎపి స్కూల్ గేమ్స్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 2014వ సంవత్సరంలో రాజేంద్ర అనే క్రీడాకారుడు సాయి స్పోర్స్ హాస్టల్‌కు మెదక్ జిల్లాకు ఎంపికయ్యాడు. అదేవిధంగా 2016 వ సంవత్సరంలో ఇనయితుల్లా అనే క్రీడాకారుడు సాయి స్పోర్ట్స్ హాస్టల్‌కు ఎంపికయ్యాడు. 2010 నుంచి 2014 వరకు ఈ పాఠశాల క్రీడాకారులు ఐదు సార్లు ఆర్డీటీ రూరల్ క్రికెట్ టోర్నమెంట్ ఏరియాలో విజేతలుగా నిలిచారు. గతేడాది గ్రిగ్స్‌పోటీల్లో జూనియర్, సీనియర్ స్పోర్ట్స్ విభాగంలో ఫుట్‌బాల్, క్రికెట్, త్రోబాల్, టెన్నికాయిట్, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, నెట్‌బాల్‌లలో పలు విన్నర్, రన్నర్ ట్రోఫీలు సాధించారు.
పిడి కఠోర శ్రమతో ఫలితం...
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గోపాల్‌రెడ్డి కఠోరశ్రమ విద్యార్థులను ఆణిముత్యాలుగా మార్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే పాఠశాలలో చదువుకున్న గోపాల్‌రెడ్డి మండల పరిధిలోని అనకనహాల్ గ్రామానికి చెందినవాడు. 1999వ సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాల్యంకు పిఇటిగా విధుల్లో చేరా డు. 2009 అక్టోబర్ 10 నుండి ఇప్ప టి వరకు ఈ పాఠశాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి అనేక మంది క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు తోడ్పాటునందించారు. ఈయన రోజూ 5 గంటలకే క్రీడాకారులు రాకమునుపే మైదానం చేరుకుని ఉత్తమమైన క్రీడాకారులను తయారు చేస్తున్నారు.
పిడి ప్రత్యక్ష దైవం : క్రీడాకారులు
తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెకిలితీసి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న ఫిజికల్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి తమకు ప్రత్యక్ష దైవమని క్రీడాకారులు అంటున్నారు. తమ తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇచ్చారని, గురు పిడి తమకు మంచి భవిష్యత్ ఇస్తున్నారని అంటున్నారు. ‘మాటలు కటువు.. మనసు వెన్నపూస’ అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణ ప్రశంసించారు.