అనంతపురం

‘పట్టు’దలతో ‘అనంత’ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 26 : పట్టు పరిశ్రమకు ప్రసిద్ధగాంచిన ‘అనంత’ జిల్లా నేడు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. జిల్లావ్యాప్తంగా 935 గ్రామాల్లో 24,566 మంది రైతులు 32,020 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. వీరిలో 15,929 మంది సన్నకారు, 5420 మంది చిన్నకారు, 3221 మంది పెద్ద రైతులు ఉన్నారు. ఇందులో బహువార్షిక పంట, నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే విక్టరీ-1 రకం మల్బరీని ఎక్కువగా పండిస్తున్నారు. నాలుగు ఎకరాల్లో మల్బరీ సాగు చేసే ప్రతి రైతుకూ కనీసం రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకూ ప్రతి నెలా ఆదాయం వస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ఇందుకు ప్రభుత్వం సైతం తగిన ప్రోత్సాహం ఇస్తోంది. మొక్కలు నాటినప్పటి నుంచి పట్టు తయారీ వరకూ విరివిగా ఆర్థిక చేయూతనిస్తోంది. ఒక్కో మల్బరీ మొక్కకు రూ.1.50 పైసలు చొప్పున రూ.10,500, రేరింగ్ షెడ్లకు పరిమాణం మేరకు రూ.82,500 నుంచి రూ.87,500 వరకూ ఇస్తోంది. అంతేకాకుండా 10 అడుగుల వరండా నిర్మాణానికి రూ.22,500, షూట్ స్టాండులు, నేత్రికలు, ట్రేలకు రూ.52,500, బైవోల్టిన్ పట్టుపరుగులను చాకీ దశ వరకు పెంచేందుకు 100 గుడ్లకు రూ.750, పట్టు గూళ్లకు కిలోకు రూ.50, రీలింగ్ యూనిట్లకు 75 శాతం సబ్సిడీని అందిస్తోంది.
ఆకు నుంచి వస్త్రం దాకా..
ప్రకృతి ప్రసాదించిన వరం పట్టు తయారీ. ఈ ప్రక్రియలో మల్బరీ మొక్కల్ని నాటిన 70 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. పంట చేతికొచ్చే దశలో నిర్దేశించిన 25-29 డిగ్రీల ఉష్ణోగ్రత, 85 శాతం గాలిలో తేమ ఉండే వాతావరణంలో ఆరోగ్యకరమైన, సక్రమంగా పట్టు గూళ్ల దిగుబడి వచ్చేందుకు వీలుగా ప్రభుత్వమే 7 రోజుపాటు పట్టు పురుగుల్ని మేపి రైతులకు సరఫరా చేస్తారు. వీటిని రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసుకున్న రేరింగ్ షెడ్లలోని షూట్ స్టాండ్లపై పర్చి, 15 రోజుల పాటు ఉదయం, సాయంత్రం రెండు ఫీడింగ్‌ల చొప్పున ఆకుల్ని వేసి మేపుతారు. మూడు రోజుల నిద్ర కలిపి మొత్తం 18 రోజుల తర్వాత పట్టు పురుగులు గూడు అల్లుకుని, అందమైన పట్టు గూళ్లు(కకూన్లు)గా రూపొందుతాయి. ఐదు రోజుల అనంతరం వీటిని రైతులు రీలర్లకు విక్రయిస్తారు. వారు పట్టు గూళ్లపై ఉన్న సిల్కు దెబ్బతినకుండా వేడిగాలిని పంపి, పట్టుగూళ్ల లోపల ఉన్న పురుగులను చంపి, రీలింగ్ యంత్రాల ద్వారా పట్టు దారాన్ని తీస్తారు. దీన్ని ఫ్యాబ్రిక్‌కు అనువుగా ట్విస్టింగ్ చేసి పట్టు వస్త్రాలు నేస్తారు.
రూ.14 కోట్ల సబ్సిడీ ఇచ్చాం..
* జిల్లా పట్టు పరిశ్రమ శాఖ జెడి అరుణకుమారి
జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో మల్బరీ సాగు చేసిన రైతులకు రూ.14 కోట్ల మేర సబ్సిడీ రూపంలో అందించాం. పట్టుగూళ్లు విక్రయించేందుకు రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ధర్మవరం, కదిరి, హిందూపురంలో పట్టుగూళ్ల మార్కెట్లు ఉన్నాయి. అలాగే ధర్మవరం, పెనుకొండ, కదిరి, హిందూపురం, మడకశిరలో పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రాలు నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉన్న బైవోల్టిన్ రకం మల్బరీ సాగులో మడకశిర డివిజన్ జిల్లాలోనే అగ్రస్థానంలో ఉంది. 2019-20 నాటికి జిల్లాలో ఇపుడున్న 32 వేల ఎకరాల నుంచి 50వేల ఎకరాల వరకూ మల్బరీ సాగు పెంచడం, 18 వేల మెట్రిక్ టన్నుల నుంచి 32 వేల మెట్రిక్ టన్నులకు పట్టుగూళ్ల ఉత్పత్తిని పెంచి, రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలోనే కొనసాగించడమే లక్ష్యం...