అనంతపురం

దినసరి మార్కెట్ సుంకం టెండర్ ఖరారుపై నీలినీడలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, మార్చి 31: కార్పొరేషన్‌లో దినసరి సంత మార్కెట్ వేలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న పంతంతో ముందుకు సాగిన అధికార పార్టీలోని ఒక వర్గం తీరా వేలంపాట డిపాజిట్టు మొత్తం 87 లక్షలు కార్పొరేషన్ ఖజానాకు జమ చేయటంలో చతికిలపడింది. టెండర్ దక్కిన తర్వాత గుత్తేదారు ఒకేసారి టెండర్ మొత్తం జమ చేయటం వలన కలిగే లాభనష్టాలపై బేరీజు వేసుకుంటూ సందిగ్ధ స్థితిని ఎదుర్కొంటున్నారు. దీనితో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రావాల్సిన దినసరి సంత వేలంపాట టెండర్‌కు బ్రేక్ పడినట్లైంది. టెండర్ నిబంధనల ప్రకారం ఒకేసారి మొత్తం 87 లక్షలు చెల్లించిన తర్వాత కాంట్రాక్ట్ దక్కించుకున్న వారికి నగరంలో సుంకం వసూలుకు వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ శ్రీహరి కన్‌స్ట్రక్షన్ నిర్దేశిత గడువు గురువారంనాటికి పూర్తి అవుతున్నా కూడా 87 లక్షలు కార్పొరేషన్ ఖజానాకు చెల్లించలేదని అధికార వర్గాలు తెలిపాయి. దీనికితోడు టెండర్ దక్కించుకున్న అధికార పార్టీలోని ఒక వర్గం ఒకేసారి అంత మొత్తం చెల్లించలేమని, వాయిదాల ప్రకారం చెల్లించే వెసలుబాటు కల్పించాలని కోరుతున్నట్లు తెలిసింది. దినసరి మార్కెట్ సంత సుంకం వేలంపాట సమయంలో సర్కార్ సవాలు 96 లక్షలకు బదులుగా తగ్గించి నిర్వహిస్తేకాని టెండర్‌లో పాల్గొనలేమని కాంట్రాక్టర్లు ఏకాభిప్రాయంతో అధికార యంత్రాంగానికి తెగేసి చెప్పారు. కార్పొరేషన్ రాబడికి గండి పడకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో కమిషనర్ చల్లా ఓబులేశు సర్కార్ సవాలును 50 లక్షలుగా నిర్ణయించారు. అలాగే వేలంపాట దక్కిన కాంట్రాక్టర్ టెండర్ మొత్తాన్ని ఒకేసారి కార్పొరేషన్ ఖజానాకు జమ చేయాలన్న షరతు నిర్ణయించారు. దీనితో వేలంపాటలో పాల్గొన్న కాంట్రాక్టర్లు పోటాపోటీగా పాల్గొన్నారు. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన టెండర్‌ను అధికార పార్టీలోని ఒక వర్గం 87 లక్షలకు వేలంపాటను దక్కించుకుంది. టెండర్‌లో పాల్గొన్న ఇతర కాంట్రాక్టర్లు మాట్లాడుతూ వేలంపాట నిబంధనల ప్రకారం ఒకేసారి టెండర్ మొత్తం 87 లక్షలు గుత్తేదారుతో కట్టించుకోవాలని కమిషనర్‌ను కోరారు. దీనిపై కమిషనర్ ఓబులేశు మాట్లాడుతూ మార్చి నెలాఖరులోగా టెండర్ మొత్తం 87 లక్షలు ఒకేసారి కట్టితీరాలన్నారు. వాయిదాలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను వసూళ్లకు మార్చి 31 ఆఖరు గడువు కావటంతో అధికార యంత్రాంగం పూర్తిగా ఆ అంశంపై దృష్టి సారించింది. దీనితో శుక్రవారం స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించి దినసరి సంత మార్కెట్ వేలంపై చర్చించాలని పాలకవర్గం నిర్ణయించింది. పాలకవర్గం అధికార పార్టీలోని ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తుందా లేక టెండర్ నిబంధనలు పూర్తిచేయని కారణంగా టెండర్‌ను రద్దు చేస్తుందా అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టెండర్ సకాలంలో అమలులోకి రానందున కార్పొరేషన్ రోజువారి వేల రూపాయలను దినసరి మార్కెట్ సుంకం రూపంలో రాబడిని కోల్పోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది.