అనంతపురం

మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం రూరల్, జూలై 29 : మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా శు క్రవారం మండలంలోని కెంచానపల్లి గ్రామం వద్ద చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వనం- మనం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా తీవ్ర వర్షాబావ పరిస్థితులతో జిల్లా లో భూగర్భజలాలు అడుగంటిపోయి ఏడారి ఛాయలు అలుముకుంటున్నాయన్నారు. ఈనేపథ్యంలో మొక్కల పెంపకంతోనే ఎడారి నివారణ సా ధ్యమన్నారు. అంతేగాకుండా జిల్లాను ఎడారి బారి నుంచి రక్షించేందుకు ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫారంపాండ్స్ తవ్వించినట్లు తెలిపారు. తద్వారా చాలా వరకూ భూగర్భజలాలు పెరిగాయన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మొక్కలు నాటుతుండగా ఒక్క జిల్లాలో 10.5 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. చీఫ్‌విప్ కాలవ మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితో రాయదుర్గంలో హరితదుర్గం పేరుతో ఐదేళ్లలో 20 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ కోన శశిదర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పదవ తరగతి పాసయ్యేలోగా మూడు మొక్కలు నాటి సంరక్షిస్తే ప్రభుత్వం గ్రీన్ పాస్‌పోర్టు ఇస్తుందని తెలిపారు. అంతేగాకుండా పరీక్షల్లో అదనపు మార్కులు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మె ట్టు గోవిందరెడ్డి, జడ్పీ చైర్మన్ చమన్, జెసి లక్ష్మీకాంతం, డిఐజి ప్రభాకర్‌రావు, ఎస్పీ రాజశేఖర్‌బాబు, అటవీ అధికారి శ్రీ్ధర్, ఆర్డీవో రామారావు పాల్గొన్నారు.