అనంతపురం

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 29 : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్పత్తి, సేవా రంగ పరిశ్రమల ఏర్పాటుకు నిబంధనలను అనుసరించి రూ.5 కోట్ల వరకూ వెచ్చించే అవకాశం కల్పించింది. ఈ పరిశ్రమలకు గ్రామ పంచాయతీ, టౌన్ ప్లానింగ్, మున్సిపల్, కంట్రీ ప్లానింగ్, ఫ్యాక్టరీల శాఖ, విద్యుత్, ఎపిపిసిబి, ఏపిఐఐసి సంస్థల నుంచి వేగవంతమైన అనుమతులు పొందేందుకు సింగిల్ డెస్క్ విధానం-2015 అమలు చేస్తోంది. ఈనేపథ్యంలో ఉత్పత్తి రంగంలో సూక్ష్మస్థాయి పరిశ్రమలకు యంత్రాలపై రూ.25 లక్షలు, చిన్న తరహా పరిశ్రమలకు రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్లు, మధ్య తరహా వాటికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టుకునే అవకాశం ఉంది. నూతన పారిశ్రామిక విధానం 2015-20 మేరకు రాయితీలను జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా అందిస్తున్నారు. అలాగే స్వచ్ఛాంధ్ర రాయితీలు సైతం ఇస్తున్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా నిర్ణీత మొత్తం రాయితీతో పాటు కాలపరిమితితో వర్తిస్తాయి.
స్వయం ఉపాధి కల్పన కోసం..
స్వయం ఉపాధి కల్పన నిమిత్తం జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పిఎంఇజిపి) కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్నారు. ఉత్పత్తి రంగంలో రూ.25 లక్షలు, సేవారంగంలో రూ.10 లక్షలకు మించకుండా పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణాన్ని పొందిన అనంతరం జనరల్, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, మహిళ, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సబ్సిడిని డిఐసి ద్వారా మంజూరు చేస్తారు. ఇది కనీసం 5 శాతం నుంచి 35 శాతం వరకు ఉంటుంది.
ఔత్సాహికులకు అవకాశం
* డిఐసి జిఎం సుదర్శనబాబు
జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు తగిన ప్రోత్సాహం ఇస్తాం. లబ్ధిదారుల వయసు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. వ్యవసాయ ఆధారితంగా ఉన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, కోల్డ్ స్టోరేజ్, ఫ్రూట్స్ ప్రాసెసింగ్ తదతర సుమారు 15 రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఖనిజ ఆధారిత, పశు సంబంధ ఆధారిత పరిశ్రమలు, వస్త్ర రంగం, సేవా రంగం, డిమాండ్ ఆధారిత పరిశ్రమలు స్థాపించుకోవచ్చు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో భారీ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరవు జిల్లాలో నిరుద్యోగ నిర్మూలనకు పరిశ్రమల స్థాపన ఉపకరిస్తుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చాక తమను సంప్రదిస్తే అర్హులకు సబ్సిడీ మొత్తాన్ని మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటాం.