అనంతపురం

ఆర్‌ఎంపిల సేవలు వినియోగించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూలై 31: రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎంపి వైద్యులకు వృత్తిపరమైన శిక్షణనిచ్చి వారి సేవలను వినియోగించుకుంటుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు నగరంలోని కమ్మ భవన్‌లో ఆదివారం జరిగిన రాష్ట్ర మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మహాసభలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలను అందించడంలో ఆర్‌ఎంపిల పాత్ర ప్రశంసనీయమన్నారు. నేటికీ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆర్‌ఎంపిలదే ప్రధాన పాత్ర అన్నారు. ప్రభుత్వపరంగా ఆర్‌ఎంపిలకు చేయాల్సినవి సిఎం దృష్టికి తీసుకెళ్లి చేస్తామన్నారు. వైద్య సేవలతోపాటు ఇతర సామాజిక కార్యక్రమాల్లోను భాగస్వామ్యం కావాలని ఆర్‌ఎంపిలకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ జి.తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు విశే్వశ్వరరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, నగర మేయర్ స్వరూప, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, డా.అక్బర్ తదితరులు హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు రాజ సిద్దార్థ, ప్రసాద్, దాదాగాంధీ, ఆర్‌ఎంపి వైద్యులు పాల్గొన్నారు.