అనంతపురం

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 31 : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 6వ తేదీ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోన శశిధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈమేరకు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఆదివారం స్థానిక రెవెన్యూ భవన్‌లో జెసి బి.లక్ష్మీకాంతం, జెపి-2 ఖాజామొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్, డిఆర్‌ఓ హేమసాగర్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 6వ తేదీ ధర్మవరంలో చేనేత కార్మికుల రాష్టస్థ్రాయి రుణమాఫీ కార్యక్రమం, నూతనంగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం ఉంటాయన్నారు. అలాగే బికె సముద్రంలో రైతు ఉత్పత్తి సంఘాల రాష్టస్థ్రాయి సమావేశం (ఎఫ్‌పిఓ)లో సిఎం పాల్గొంటారన్నారు. ధర్మవరంలో నిర్వహించే కార్యక్రమాలన్నింటికీ ఓవరాల్ ఇన్‌చార్జులుగా జడ్పీ సిఇఓ రామచంద్ర, సెరికల్చర్ జెడి అరుణకుమారి, బుక్కరాయసముద్రంలో జరిగే కార్యక్రమాలకు ఓవర్ ఆల్ ఇన్‌చార్జిగా జెసి-2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్‌ను నియమిస్తూ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెండు ప్రాంతాల్లోనూ హెలిప్యాడ్, బారికేడింగ్ పట్టిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బి మాధవీ సుకన్యను ఆదేశించారు. బుక్కరాయసముద్రంలో భారీ ఎత్తున ఆస్తుల పంపిణీ మెగా చెక్ రూపంలో అందించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలన్నారు. ధర్మవరంలో చేనేత ఉత్పత్తులతో ఎగ్జిబిషన్‌ను 20 స్టాళ్లకుపైగా, బుక్కరాయసముద్రంలో రైతులకు సంబంధించిన వస్తువులు, సామగ్రితో ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. పకడ్బందీ డయాస్, రెయిన్ ఫ్రూప్ షామియానాలు, ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పరిభ్రత చర్యలు చేపట్టాలని డిపిఓను, సిఎం కాన్వాయి, బహిరంగ సభ సమీపంలో అంబులెన్స్ 108 వాహనాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణను, హెలిప్యాడ్ వద్ద ఫైరింజన్‌ను సిద్ధంగా ఉంచాలని అగ్నిమాపకాధికారిని, నిరంతర విద్యుత్‌తో పాటు జనరేటర్‌తో సంసిద్ధంగా ఉండాలని ఎస్‌పిడిసిఎల్ ఎస్‌ఇని ఆదేశించారు. అలాగే కళాజాత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సమాచార, పౌర సంబంధాల శాఖ ఏడి తిమ్మప్పను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సి ఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ, డ్వామా పీడీలు వెంకటేశ్వర్లు, నాగభూషణం, హార్టికల్చర్ డిడి సుబ్బరాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.