అనంతపురం

సాఫ్ట్‌బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొనడం సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 2: జాతీయ స్థాయిలో జరిగే సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు మంగళవారం ఆర్‌డిటి క్రీడామైదానంలో క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌టిడి స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 6 నుండి 11 వరకు పంజాబ్ రాష్ట్రంలోని ఎల్‌పి యూనివర్సిటీ ఆవరణలో జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. గతంలో అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆంధ్రా జూనియర్ సాప్ట్‌బాల్ జట్టుకు ఎంపిక చేశామని, అందులోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో సాఫ్ట్‌బాల్ క్రీడలో రాణించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు సంపాదించాలని కోరారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేసులు, సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షుడు సి.నాగరాజు, పిఈటి అసోసియేషన్ కార్యదర్శి ప్రభాకర్, కేశవమూర్తి, కోచ్‌లు ఓబిలేసు, జగదీష్, క్రీడాభిమానులు పాల్గొన్నారు.