అనంతపురం

చేనేతకు చేయూత దక్కేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం రూరల్, ఆగస్టు 5:చేనేత కార్మికులకు అందుతున్న సంక్షేమ ఫలాలు ముఖ్యమంత్రి రాకతోనైనా తిరిగి కొనసాగుతాయని కొండత ఆశతో చేనేతలు ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీల మాట అటుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు అందుతున్న పలు సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగం సంక్షేమ పథకాలు ఆగిపోవడంతో విలవిల్లాడిపోతోంది. కుటుంబ పోషణ భారమై చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి ధర్మవరం పర్యటనకు ముందురోజు సైతం ఓ చేనేత కార్మికుడు బలవన్మరణం చెందడం ఇందుకు తార్కాణం.
ధర్మవరం పట్టణంలో చేనేత రంగం తీవ్ర సంక్షోభానికి గురౌతున్న తరుణంలో దీనికి ఎంతో కొంత చేయూతనందివ్వాలన్న సదుద్దేశ్యంతో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చొరవ తీసుకుని ప్రతి నెలా చేనేత కార్మికులకు ముడిపట్టు కొనుగోలుపై కిలోకు రూ.150లు చొప్పున మొత్తం 4కేజీలకు రూ.600లు రాయితీ అందేలా ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చారు. దీంతో ప్రతి నెలా జిల్లా వ్యాప్తంగా 25వేల మంది చేనేతకార్మికులకు నెలకు రూ.600లు చొప్పున తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలలకు అందుకు కేటాయించిన బడ్జెట్ అయిపోవడంతో అప్పటి నుండి నేటి వరకు దాదాపు 18నెలలుగా ముడిపట్టు రాయితీ సొమ్ము చేనేతలకు అందకుండా నిలిచిపోయింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇదే ముడిపట్టు కొనుగోలుపై కిలోధరలో 50శాతం రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ అంశాన్ని పట్టించుకోకపోగా గతంలో కొనసాగుతున్న రాయితీ పథకాన్ని సైతం మరుగున పడేశారు. అదేవిధంగా ఎన్‌హెచ్‌డిసి కింద రేషం కొనుగోలుపై 10శాతం రాయితీ కూడా ఆగిపోయింది. దీనికి తోడు ఐసి ఐసి ఐ లాంబార్డ్ హెల్త్‌కార్డుల పథకం కూడా పూర్తిగా ఆగిపోయింది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కార్మికునికి రూ.15వేలు వరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం చేయించుకునే అవకాశం వుంది. ఇది సైతం ఆగిపోయింది. దీనికి తోడు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రధాన అంశమైన చేనేత రుణమాఫీ చేస్తామని రెండేళ్ళు గడవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలపై వడ్డ్భీరమే దాదాపు రూ.8.50కోట్లు పడింది. ఎన్నికల హామీల్లో ఇచ్చిన వివిధ పథకాల అమలుచేయడంతో పాటు ఈ పథకాలను పునరుద్ధరించి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నదే చేనేతల మనోవాంఛ. అయితే ముఖ్యమంత్రి నేడు ధర్మవరం పర్యటనలో భాగంగా కేవలం రుణమాఫీ చెక్కు పంపిణీకే పరిమితమవుతారా? లేక చేనేతలకు ఎన్నికల హామీల అంశాలను సైతం తమకు అందిస్తారా? అని చేనేతలు ఎదురుచూస్తున్నారు. కాగా చేనేత రుణాలతో పాటు పవర్‌లూమ్స్ రుణాలు సైతం మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికితోడు ఒక్కొక్క చేనేత కార్మికునికి 3సెంట్ల స్థలం ఇచ్చి రూ.2లక్షలతో వర్క్‌షెడ్ నిర్మాణం చేయిస్తానన్నారు. జరీపై పూర్తిగా వ్యాట్‌ను రద్దు చేస్తామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.1000కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తు ప్రతి ఏటా బడ్జెట్‌లో చేనేతలకు రూ.1000కోట్లు కేటాయిస్తామన్నారు. చేనేత సహకార సంఘాల భవనాలకు ఆస్తిపన్ను మినహాయింపు ఇస్తామన్నారు. ప్రభుత్వమే చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి ముడిసరుకు సరఫరా, మార్కెటింగ్ సౌకర్యం పాటు జిల్లా డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వృద్ధ చేనేత కార్మికుల కోసం ధర్మవరం, ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన ప్రాంతాల్లో ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత వస్త్ర విక్రయాలపై 30శాతం రిబేటుతో పాటు సబ్సిడీపై నూలు, రంగులు అందిస్తామన్నారు. మగ్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. జిల్లాకు ఒక చేనేత పార్కును ఏర్పాటు చేసి కార్మికులకు శిక్షణ, ఉపాధి కల్పిస్తామన్నారు. చేనేత కార్మికుల పిల్లలను చదివించేందుకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు ఉచిత వైద్య సౌకర్యం కూడా అందిస్తామన్నారు. చేనేతల ఉత్పత్తుల ఆఫ్ సీజన్ సమయాల్లో రుణసదుపాయం కల్పించి గిట్టుబాటు ధరలు వచ్చేదాకా వాటిని నిల్వ వుంచుకునే అవకాశం కల్పిస్తామన్నారు. 50శాతం సబ్సిడీతో మగ్గం మెటీరియల్‌ను అందిస్తామన్నారు. ఇలా పలు హామీలు చేనేతలకు ఎన్నికల సమయంలో ఇచ్చారు. రెండేళ్ళు దాటినా ప్రభుత్వం వీటిలో ఏవీ నెరవేర్చలేదన్న బాధతో వున్న చేనేతలకు నేడు సి ఎం పర్యటనతో చేయూత అందేనా అని పలువురు చేనేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.