జాతీయ వార్తలు

న్యాయ వ్యవస్థను నాశనం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం న్యాయమూర్తులను నియమించకుండా ప్రజాస్వామ్యం మూల స్థంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థను నాశనం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. ఎఐసిసి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం న్యాయమూర్తులను నియమించకపోవటం వలన న్యాయ వ్యవస్థకు ఎదురవుతున్న ఇబ్బందులను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్ శుక్రవారం మరోసారి వెల్లడించారని చెప్పారు. న్యాయ వ్యవస్థ పట్ల ఎన్‌డిఏ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని సింఘ్వీ తెలిపారు. లౌకికవాదం పట్ల ఎన్‌డిఏ సర్కారుకు గల చిత్తశుద్ధి ఏపాటిదో ఇప్పటికే తేటతెల్లమైందని, మోదీ ప్రభుత్వం తాజాగా న్యాయ వ్యవస్థను తమ అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని సింఘ్వీ ఆరోపించారు. న్యాయ వ్యవస్థను ముప్పతిప్పలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం నియామక నిబంధనల పేరుతో ఆ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. తాము ప్రతిపాదించిన నియామక నిబంధనలను న్యాయ వ్యవస్థ ఆమోదింనంత వరకూ న్యాయమూర్తుల నియామకం జరగదని ప్రభుత్వం చెప్పటం సిగ్గుచేటన్నారు. దేశంలో దాదాపు 1,100 మంది న్యాయమూర్తులు ఉండవలసి ఉండగా ప్రస్తుతం 450 మంది మాత్రమే ఉన్నారని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పెండింగ్ కేసుల సంఖ్య పెరగకుండా ఎలా ఉంటుందని, సగటు మనిషికి సకాలంలో న్యాయం ఎలా లభిస్తుందని సింఘ్వీ ప్రశ్నించారు.