జాతీయ వార్తలు

అవినీతిపై ప్రజలు చైతన్యవంతులు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: అవినీతి నిర్మూలనలో ప్రజలు ముందుకు రావాలని సెంట్రల్ విజిలెన్సు కమిషనర్ కె.వి.చౌదరి పిలుపునిచ్చారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏటా అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని విజిలెన్స్ అవగాహన వారోత్సవాన్ని నిర్వహించింది. అనతరం చౌదరి విలేఖరులతో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో అవినితిని ఎలా నిర్మూలించవచ్చన్న ఆంశంపై అవగాహన పెంపొందిస్తామన్నారు. అవినీతిని అరికట్టడంలో మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్రజలు తమ గుర్తింపును కాపాడుకుంటూ ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతిపరులపై వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలుంటుందన్నారు. అవినీతికి పాల్పడబోనని, ఏదైనా అవినీతి జరిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీవీసీ వెబ్‌సైట్ ద్వారా ప్రతిజ్ఞ చేయ్యవచ్చన్నారు.