జాతీయ వార్తలు

వాతావరణంలో పెనుమార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: దేశంలోనే సమశీతోష్ణ దక్కన్ ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో క్రమేణా చోటు చేసుకున్న పెనుమార్పుల వల్ల ఆకస్మిక వరదలు, కరువుకాటకాలు, దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. దీనికి కారణం గత ప్రభుత్వాలు సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడమేనని అన్నారు. బుధవారం నాడిక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ‘అసాధారణ వాతావరణ పరిస్థితులు-తెలంగాణ రాష్ట్రం’ అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ, భారత వాతావరణ సంస్థ హైదరాబాద్ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వర్క్‌షాప్ నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం పథకం బృహత్తరమైనదని ఆయన అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మిషన్ కాకతీయ, హరితహారం పథకాలు కాలుష్యాన్ని అధిగమించడానికి ఉపయోగపడతాయని తెలిపారు.

హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ‘అసాధారణ వాతావరణ పరిస్థితులు-తెలంగాణ రాష్ట్రం’
అనే అంశంపై ప్రసంగిస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి