రాష్ట్రీయం

ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకంలో జాప్యమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: కార్బైడ్ పూసిన పళ్లను మార్కెట్‌లో అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ హైకోర్టు తామిచ్చిన ఆదేశాలను పాటించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన అధికారులను నిలదీసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అధికారుల వివరణ కోరింది. అమికస్ క్యూరీ ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత తీవ్రంగా ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇరు రాష్ట్రాల్లో ఆ అధికారుల సంఖ్య చాలా తక్కువని న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో న్యాయమూర్తులు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులను ప్రశ్నించారు. దాంతో తెలంగాణ తరఫున హాజరైన స్పెషల్ కౌన్సిల్ ఎ సంజీవ్ కుమార్ ఇప్పటికే ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అధికారుల రిక్రూట్‌మెంట్ చేపట్టాలని సర్వీసు కమిషన్‌కు లేఖ రాసిందని చెప్పారు. ఆంధ్రలో పరిస్థితిపై నిలదీసిన న్యాయమూర్తులు ఎందుకు జాప్యం జరుగుతుందో వివరించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించారు.