ఆంధ్రప్రదేశ్‌

అమరావతి డిజైన్లపై ఉన్నతస్థాయి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి ప్రభుత్వం తెరతీసింది. 900 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు ఆరుగురు సభ్యులతో ఉన్నతాధికార కమిటీని నియమించింది. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, సిఆర్‌డిఎ కమిషనర్, సిఆర్‌డిఎ ప్లానింగ్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. వివిధ సంస్థలు ఇచ్చే డిజన్లు, ఇతర పాలనాపరమైన అంశాలపై ఈ కమిటీ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటుంది. మరోవైపు జపాన్‌కు చెందిన మాకి అసోసియేట్స్ రూపొందించిన డిజైన్లకు 95 కోట్ల రూపాయలు చెల్లించే అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐదుగురు సభ్యులతో మరో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి టిఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా ఉంటారు. ఈ కమిటీలో సిఆర్‌డిఎ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్ధిక శాఖ కార్యదర్శి, జిఎడి కార్యదర్శి, సిఆర్‌డిఎ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. మాకీ సంస్థ 95.25 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుండగా, దానిని తగ్గించుకోవలసిందిగా ప్రభుత్వం కోరుతోంది. కాగా మాకీ సంస్థకే 900 ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయాల కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను రూపొందించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. గతంలో ఇచ్చిన డిజైన్లను మార్చాల్సిందిగా ప్రభుత్వం కోరింది.