ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగ నేతల్లో చీలిక చిచ్చు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10:సచివాలయం తరలింపువ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. తరలింపును కనీసం ఆరునెలల వరకూ వాయిదా వేయాలని సచివాలయ గెజిటెడ్ అధికారుల సంఘం కోరుతుండగా, నిర్ణీత గడువులోగా ఉద్యోగులు వస్తారని ఏపి ఎన్జీఓ నేత అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ చెబుతున్నారు. అశోక్‌బాబు ఒక సందర్భం లో ఛోటా మోటా నేతలను పట్టించుకోవద్దని, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పడం, తరలివచ్చేందుకు సుముఖంగా లేని వారే ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించడం, అశోక్‌బాబు నియంతృత్వ పోకడలతో నష్టం జరుగుతోందని గెజిటెడ్ ఉద్యోగ సంఘ నేత పటేల్ తాజాగా ఆరోపించడంతో.. ఉద్యోగ సంఘాల మధ్య చీలిక చిచ్చు స్పష్టంగా కనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగుల సంఘంలో మురళీకృష్ణ ప్రభావం ఎక్కువగా ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. తరలింపు ముందు వరకూ సచివాలయ ఉద్యోగులు ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చారు. అయితే, తరలింపై అంశంపై ఆయన తమ పక్షాన నిలిచి ప్రభుత్వంపై పోరాడటం లేదన్న అసంతృప్తి ఉద్యోగులలో వ్యక్తమవుతోంది. తరలింపు వ్యవహారంపై ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడం, సౌకర్యాలు కల్పించిన తర్వాత తరలించాలని గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేయడంతో, నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మొత్తం ఐదు సంఘాలుండగా, తరలింపు అంశం తర్వాత సంఘాలకు అతీతంగా అందరూ గెజిటెడ్ అధికారుల వాదనను బలపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, సౌకర్యాలు కల్పించిన తర్వాతనే తరలించాలని డిమాండ్ చేయవలసిన మురళీకృష్ణ గళం బలహీనమయిందని, ఆయన ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడుతున్నారన్న అసంతృప్తి ఉద్యోగులలో మొదలయింది.
అదే సమయంలో గెజిటెడ్ అధికారుల సంఘ నేతలయిన పటేల్, కృష్ణయ్యలు తరలింపు వ్యవహారంలో గట్టిగా గళం విప్పడంతో..సహజంగా ఉద్యోగులు వారినే సమర్ధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంఘం తమ పక్షాన నిలబడిందన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. తరలింపు అంశంలోప్రభుత్వం తొందరపడకుండా, పూర్తి సౌకర్యాలు కల్పించిన తర్వాత ప్రక్రియ ప్రారంభిస్తే అందరూ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వాదిస్తున్నారు. కనీసం ఆరునెలల గడవు ఇవ్వాలని గెజిటెడ్ సంఘం నేతలు సీఎం బాబును కలిసి అభ్యర్ధించారు.
కాగా, కొందరు నేతలు ఎమ్మెల్సీలు కావాలన్న అత్యుత్సాహంతో ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారన్న విమర్శలు, ఉద్యోగవర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా చాలామంది ఉద్యోగ నేతలు పదవీ విరమణ తర్వాత, రాజకీయాల్లో చేరి పదవులు పొందిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే కౌన్సిల్ ఎన్నికల్లో టికెట్లు పొందేందుకు, కొంతమంది ఉద్యోగ సంఘాలు ఇప్పటినుంచే అధికారపార్టీని మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే తరలింపు వ్యవహారం సజావుగా సాగుతోందన్న వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.