జాతీయ వార్తలు

స్థానికతకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిర పడేవారికి స్థానికత కల్పించేందుకు ఉద్దేశించిన రాజపత్రాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గత రాత్రి జారీ చేశారు. 2014 జూన్ రెండో నుంచి 2017 జూన్ రెండో తేదీ మధ్యకాలంలో తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడే వారికి స్థానిక కల్పించేందుకు రాష్టప్రతి ఉత్తర్వులు వీలు కల్పిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి)లోని క్లాజ్ 1, 2 ప్రకారం రాష్టప్రతికి ఉన్న అధికారం మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల నిర్వహణ, ప్రవేశ చట్టం 1974 చట్టంలోని నాల్గవ పేరాగ్రాఫ్‌ను సవరించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జారీ చేసిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన మార్గదర్శక సూత్రాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఆంధ్రకు చెందిన ప్రభుత్వోద్యోగులు కొత్త రాజధాని అమరావతికి తరలి వెళ్లేందుకు ఎదురవుతున్న ఇబ్బందుల్లో స్థానికత ఒకటనేది అందరికీ తెలిసిందే. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారి పిల్లలకు స్థానిక విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పించేందుకు ఈ స్థానికత అవసరముంటుంది. రాష్టప్రతి ఉత్తర్వుల ప్రకారం 2014-2017 మధ్య కాలంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిరపడే వారి పిల్లలకు ఆంధ్ర విద్యా సంస్థల్లో స్థానిక పిల్లలతో సమామైన హోదా లభిస్తుంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలు 1974 చట్టాన్ని రాష్టప్రతి ఉత్తర్వుల ద్వారా సవరించారు. తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో స్థిరపడినా వారిని ఆ ప్రాంతంలో స్థానికులుగా గుర్తిస్తారు. స్థానిక విద్యా సంస్థల్లో వీరి పిల్లలకూ స్థానిక పిల్లలతో సమానంగా ప్రవేశార్హత కల్పిస్తారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిరపడే వారికి స్థానికత కల్పంచేందుకు వీలుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డి ప్రకారం రాష్ట్ర విద్యా సంస్థల ప్రవేశ చట్టాన్ని సవరించాలని కోరుతూ సిఎం చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాయటం తెలిసిందే. చంద్రబాబు రాసిన లేఖ ఆధారంగా హోంశాఖ రాష్ట్ర విద్యాసంస్థల చట్టానికి సవరణ ప్రతిపాదించింది. హోంశాఖ ప్రతిపాదించిన సవరణకు ప్రధాని నరేంద్ర మోదీ గతవారం తమ ఆమోదం చెప్పటం తెలిసిందే. ప్రధాని ఆమోదం లభించగానే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి గతవారమే పంపించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సవరణకు రాష్టప్రతి గత రాత్రి తమ ఆమోదం తెలియజేయటంతో ఇందుకు సంబంధించిన రాజపత్రం జారీ అయ్యింది.
స్థానికతపై రాష్టప్రతి ఉత్తర్వులు రావటం సంతోషకరమైన విషయమని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు శుక్రవారం మీడియాతో అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని ప్రాంతం నుంచే పరిపాలన అందించాలనే లక్ష్యంతో చంద్రబాబు అమరావతి నుంచి పని చేస్తున్నారనేది అందరికీ తెలిసిందేనన్నారు. కొత్త రాజధాని నుంచి పాలన అందించేందుకు వీలుగా అధికారులు, ప్రభుత్వోద్యోగులను అమరావతికి తరలించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు స్థానికత ఇంతకాలం అడ్డుపడిందని ఆయన చెప్పారు. స్థానికతకు సంబంధించిన రాజపత్రం జారీ అయినందున తెలంగాణ నుంచి పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఇకనైనా అమరావతికి తరలిరావాలని కంభంపాటి సూచించారు.
కాపు ఉద్యమంపై రామ్మోహన్ రావు వ్యాఖ్యానిస్తూ, రాష్ట్రంలో కాపుల కోసం పోరాడుతున్నామని చెబుతున్న నాయకులు, గత పదేళ్లలో ఎప్పుడూ ఆ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేయలేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.