జాతీయ వార్తలు

ఏదీ వదలం అన్నీ చేస్తాం... రాజ్యసభలోనూ జైట్లీది పాత పాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: పోలవరం నిర్మాణ పనులు నిరంతరంగా కొనసాగుతాయి. పోలవరం పనులు ఏ దశలోనూ ఆగనిచ్చేది లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు. శుక్రవారం రాజ్యసభలో 2018-19 వార్షిక బడ్జెట్‌పై జరిగిన చర్చకు జైట్లీ బదులిస్తూ ఏపీ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ఇస్తున్న ప్రత్యేక ఆర్థిక సాయాన్ని నాబార్డ్ ద్వారా ఎలా ఇప్పించాలనే అంశంపై జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నాయి అని ఈ సందర్భంగా ప్రకటించారు. దీనిపై అతి త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని జైట్లీ స్పష్టం చేశారు. గతంలో ఈ సాయాన్ని విదేశీ రుణాల నుంచి ఇచ్చే వారని, అయితే రుణాలు మంజూరీలో ఆలస్యం అవుతున్నందున వాటిని నాబార్డ్ ద్వారా ఇప్పించాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారని గుర్తు చేశారు. ఈ అంశంపై చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని జైట్లీ వెల్లడించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించిన పది నెలల రెవెన్యూ లోటులో ఇప్పటికే 3979 కోట్లు రాష్ట్రానికి చెల్లించామన్నారు. తుది మొత్తం ఎంత ఇవ్వాలనే అంశంపై ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని జైట్లీ వివరించారు. దుగ్గరాజపట్నం ఓడరేవు నిర్మాణం, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, విశాఖపట్నం పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, వైజాగ్- చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ తదితర అన్ని ప్రాజెక్టులనూ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులకు సూచించామని జైట్లీ వివరించారు. ఈ పథకాల విషయంలో కేంద్రం చొరవ తీసుకుని, వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రాజెక్టులను ఎప్పటిలోగా పూర్తిచేస్తారన్న విషయాన్ని ప్రకటించాలని సీఎం రమేష్ డిమాండ్ చేయడంతో, వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తామని జైట్లీ బదులిచ్చారు. ప్రాజెక్టులను బడ్జెట్‌లో చేరిస్తే తమకు భరోసా ఉంటుందని టీజీ వెంకటేష్ సూచించారు. అమరావతి, ఇతర ప్రాజెక్టులకు వీలైనంత ఎక్కువ నిధులు కేటాయించాలని టి సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు. అమరావతికి ఇప్పటికే నిధులిచ్చామని ఆర్థిక మంత్రి చెప్పారు. రాష్ట్ర విభజన చట్టాల్లో ఆంధ్రతోపాటు తెలంగాణ కూడా ఉంది కనుక, తెలంగాణ ప్రాజెక్టులనూ త్వరగా పూర్తి చేయించాలని తెరాస ఎంపీ కె కేశవరావు డిమాండ్ చేయడంతో తప్పకుండా చేస్తామని జైట్లీ బదులిచ్చారు.
ఇదిలావుంటే రాజ్యసభ అధ్యక్షుడు ఎం వెంకయ్యనాయుడు శుక్రవారం సాయంత్రం తమ చాంబర్‌లో అరుణ్ జైట్లీతో సమావేశమై విభజన చట్టం హామీలపై చర్చించారు. సమావేశానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి సైతం హాజరయ్యారు. విభజన చట్టంలోని హామీలను వీలైనంత త్వరగా అమలు చేయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి వెంకయ్య సూచించినట్టు తెలిసింది.

chitram..
రాజ్యసభలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ