జాతీయ వార్తలు

అరవింద్ సుబ్రమణియన్‌కు మంత్రుల బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రధానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న అరవింద్ సుబ్రమణియన్‌కు తక్షణం ఉద్వాసన పలకాలంటూ బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇద్దరు కేంద్ర మంత్రులు స్పందించారు. అరవింద్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన ఇచ్చే సలహాలకు ఎంతో విలువ ఉందని కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘స్వామి చేస్తున్న వ్యాఖ్యలను ఎంతవరకూ పరిగణనలోకి తీసుకోవచ్చ’ని ఆర్థికమంత్రి జైట్లీ విలేఖరులను ప్రశ్నించారు. కాగా, అరవింద్‌పై స్వామి చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటికి పార్టీకి సంబంధం లేదని బిజెపి వర్గాలు స్పష్టం చేశాయి. అరవింద్‌ను ఆర్‌బిఐ గవర్నర్‌గా నియమించవద్దని సుబ్రమణ్య స్వామి ఆరోపణలు సంధించిన సంగతి తెలిసిందే.