అర్చన

ఆత్మీయత, ఫ్రేమానురాగాల కలబోత వెదురుపాక ‘గాడ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన కాలంనాటి సద్గురు పరంపరలో సాధనాతత్త్వం మూర్త్భీవించిన శ్రీ వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యంగారు అగ్రగణ్యులు. నిరంతరం శ్రీ విజయదుర్గా మాత సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉండే మహాతపశ్శాలి, అవధూత. గురుశిష్య సంబంధానికి నూతన ఒరవడి కల్పించి భక్తకోటికి బాగా చేరువైన గురువుగా ఆయనకు పేరు. సామాన్య ప్రజానీకానికి బాగా అందుబాటులో ఉండే పీఠం శ్రీ విజయదుర్గా పీఠం. అది సామాన్యుల పీఠం. అందరిదీ ఒకే కుటుంబం. అందరూ ఒకే కుటుంబ సభ్యులు అనే అద్భుత భావాన్ని వ్యాపింపజేసిన పీఠం. అందరం జగన్మాత పిల్లలమే అనే మహనీయమైన భరోసాని ఇచ్చే పీఠం శ్రీ విజయదుర్గాపీఠం. ఉత్తేజకరమైన భావాన్ని, భరోసాని భక్తులలో పరివ్యాప్తం చేస్తున్నందున ఆయనను భక్తులంతా గాడ్(్భగవంతుడు)గా పిలుచుకుంటూ ప్రతి జనవరి 17,18,19 తేదిల్లో జన్మదినవేడుకలు ఘనంగా జరుపుతారు. అపుడే తిరుమలనుంచి వచ్చిన కల్యాణ మూర్తులకు కనుల పండుగగా శాంతి కల్యాణోత్సవాలు. పరివార దేవతలకు పుష్పోత్సవాలను వైభవంగా జరుపుతారు. జనవరి 18అమ్మ మంత్రోపదేశం ఇచ్చిన రోజును పురస్కరించుకొని లక్షగులాబీలతో అమ్మవారికి, గాడ్ (గురుజీ)కీ అత్యంత వైభవోపేతంగా అర్చనలు, హోమాల లాంటి విశేషపూజలు నిర్వహిస్తారు.

‘నే టినుండి నీ చరిత్ర మారుతోంది’అని శాసించి, దివ్యమంత్రోపదేశం అనుగ్రహించింది అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి. అప్పటి వరకూ లౌకికదృష్టితో ఉన్న వారెవరైనా సరే అమ్మ అనుగ్రహం పొందిన తరువాత ఇక లౌకికం ఏముంటుంది! అంతా లోక కల్యాణకారకమే కదా. ఇక్కడా జరిగిందదే!
అప్పటివరకు రాజకీయాల్లో స్థానం సంపాదిం చుకోవాలన్న ఆతృతతో ఉన్న వాడ్రేవు వేంకట సుబ్రహ్మణ్యం అమ్మ అనుగ్రహం పొందిన నాటినుంచి గాడ్‌గా పిలుపులు అందుకుంటు న్నారు. ఆయన జీవితం ఆరోజు నుంచి ఆధ్యాత్మిక రంగం దిశగా మలుపుతిరిగింది. అమ్మవారు అతని అరచేతి రేఖలను సైతం మార్చేసింది. ఆ యువకుడు కఠోర తపస్సు ఆరంభించాడు. ఉపాసన తీవ్రం అయింది. అక్కడే విజయాలను అందించే అమ్మవారి పీఠం నెలకొంది. ఆ పీఠమే నేటి విజయదుర్గా అమ్మవారి పీఠం. వివిధ దేవీ దేవతలు అందరూ విచ్చేశారు. ఆ పీఠంలోనే కుదురుకున్నారు. కమలనాథుడు, శ్రీ ఉమా జల చంద్రవౌళీశ్వర స్వామి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, ఇలా ఎందరో దేవీదేవతలే కాదు గురవే సర్వలోకానామ్.. కనుక గురుమేధా దక్షిణామూర్తి కూడా వేంచేసి శ్రీ విజయదుర్గా పీఠంలో కొలువైయ్యారు. అమ్మ 1974 నవంబర్ 2వ తేదీన మరోమారు దర్శనం ఇచ్చింది. పీఠంలో నిరతాన్నదానం నిర్దేశించింది. అర్చనాది విధివిధానాలు సూచించింది. ఆరోజునుంచి అక్షరాల అమ్మవారు చెప్పినట్లే పీఠం కొనసాగుతూ వస్తోంది. గత 42 ఏళ్ళుగా 20 లక్షల మంది భక్తులు ఆ పీఠాన్ని దర్శించారు. అమ్మవారిని సేవించారు. భక్తుల పాలిట ఆ పీఠం కల్పతరువై, కామధేనువై 48 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తూ వస్తోన్న గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమై అలరారుతోంది.
ఆ క్షేత్రమే వెదురుపాక శ్రీ విజయదుర్గా పీఠం! రాజమండ్రికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న కుగ్రామం. కాని అమ్మ ఆశీస్సులుఅందుకొన్న గాడ్ అడుగిడిన నాటినుంచి అమ్మవారి నిత్యకల్యాణాలతో, ధూపధీప నైవేద్యా లతో, అంగరంగ వైభోగంగా ఇలలో నిలచిన అపర విజయదుర్గామాత నిలయంగా భాసిలు లతోంది.
1974 నుంబరు 24నాటి బ్రాహ్మీ ముహూర్తంలో మొదటిసారిగా వెదురుపాక పీఠంలో అమ్మవారి పాదముద్ర వెలిసింది. కన్యాకుమారిలో వివేకానందుడికి తన కుడి కాలి ముద్రను అనుగ్రహించిన అమ్మ- విజయదుర్గా పఠంలో తన ఎడమ కాలి దివ్యపాదముద్రను ప్రసాదించిందని పరిశోధనలలో తేలింది. ఇది పీఠం ఆవిర్భావ చరిత్ర!
శ్రీ రామకృష్ణ పరమహంస దివ్య సమక్షంలో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతని మనస్సు నిర్వికల్ప సమాధిస్థితిని గాఢంగా అభిలషిస్తోంది. ఆ విషయాన్ని తన గురువుకు నివేదించాడు. అనుగ్రహించమని అర్ధించాడు. రామకృష్ణులు ఆ యువకుడికేసి ఆశ్చర్యంగా చూశారు. ‘‘ఇలా అడగడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా?’’అని పరిహాస పూరిత స్వరంతో ప్రశ్నించారు. ‘‘నీమీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. నీవొక ఆధ్యాత్మిక మహావృక్షంగా ఎదిగి, ఆశ్రీతులకు సాధకులకు చల్లని నీడను ఇస్తావని ఆశించాను. దీపధారివి కావాలనుకున్నాను. ఇలా స్వీయ స్వాతంత్య్రం ఆశిస్తావని ఒక్కడినే తరించాలనుకుంటానని నేను ఏనాడూ ఊహించలేదు. నీలో ఈ కోరిక కదలాడటం గమనించలేదు’’అన్నారు. ఆ క్షణంలో ఆ యువకుడికి ఒక మెరుపు మెరిసినట్లయి తన జన్మరహస్యం అవగతమయింది. తన పుట్టుకకు పరమార్ధం బోధపడింది. ఈ జాతికి ఒక అద్భుత ఆధ్యాత్మికవేత్త లభించాడు. భారతదేశపు మహోన్నత ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వానికంతటికీ చాలా గొప్పగా చాటి చెప్పాడు.
రామకృష్ణ పరమహంస తట్టిలేపిన ఆ చైతన్యమే- వివేకానందుడు 1972 వ సం.రం ఆగస్టు నెల రాజకీయాల పట్ల విశేషమైన ఆసక్తికలిగిన ఒక యువకుడు నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు స్వర్గీయ మొసలికంటి తిరుమలరావుగారి సహాయంతో ఎమ్మెల్సీ సీటు సాధించాడు. మరో రెండురోజుల్లో నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకున్నాడు. పెద్దల ‘చే’యూతతో గెలుపు సులభంగా తోచింది. అంచెలంచెలుగా ఇక రాజకీయాలలో రాణిస్తూ ఎదిగిపోవాలని కలలుకంటున్న 18వ తేదీ శ్రావణ శుక్రవారం రాత్రి గం.12.42ల వేళ అకస్మాత్తుగా జగన్మాత ఆ యువకుడి స్వప్నంలో విజయదుర్గాదేవి రూపంలో సాక్షాత్కరించింది.
సాధనా గురుతత్త్వం
ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా మన దేశపు ప్రాశస్త్యాన్ని ఒక్క ముక్కలో సమీక్షిస్తూ ‘్భరతదేశం భగవదనుగ్రహం పొందిన దేశాల్లో ఒకటి.’ అని వ్యాఖ్యానించింది. ఇది చాలా అపురూపమైన సమీక్ష. ఒక దేశానికి చెందిన సాంస్కృతిక స్వరూపం తాలూకు సమగ్రతను జీర్ణించుకుంటే తప్ప- అలాంటి వ్యాఖ్యానం చెయ్యడం సాధ్యంకాదు. ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, అన్నపానీయాలు, వస్త్భ్రారణాలు, సాహిత్య విజ్ఞాన విశేషాలు, భాషలూ.. ఇలా ఎన్నో అంశాలతోపాటు అన్నింటికన్నా ముఖ్యంగా మానవ జీవితంపట్ల ఈ దేశపు ప్రజల వైఖరిని సంపుటీకరించుకుంటే గాని అలా ఒక నిర్ణయానికి రావడం అసంభవం. ఈ అన్ని అంశాలతో కూడిన భారతదేశపు సాంస్కృతిక స్వరూపం వెనుక ఒక అద్భుతమైన తాత్త్విక నేపథ్యం తొంగి చూస్తోందని- సదరు నేపథ్యం మూలంగానే ఈ దేశపు సంస్కృతికి వైభవోపేతమైన ప్రతిష్ఠ జతపడుతోందని భారతీయ ఆత్మను దర్శించిన మహానీయుల అభిప్రాయం. నికషోపలమైన అలాంటి అభిప్రాయాల క్రోడీకరణమే-ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికా వ్యాఖ్యానం! సంస్కృతికి పట్టు అంచులాగా తాత్త్విక నేపథ్యం భాసించడంవల్లనే ఈ దేశానికి భగవదనుగ్రహం కల్గిందని విజ్ఞుల అభిప్రాయం. ప్రజల మనుగడలోనుంచి వ్యక్తమవుతున్న ఈ నేపథ్యానికి కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముందుగా పేర్కొనవలసింది గురుపరంపర! ఆధ్యాత్మిక జీవన సౌందర్యం గురించి, దాని ఆవశ్యకత గురించి బాగా ప్రచారంచేసిన గురువుల ప్రభావం ప్రజలమీద ఎక్కువగా కనబడుతుంది. ఆచార వ్యవహారాల రీత్యా, వివిధ గురువుల మార్గాలు వేరువేరుగా ఉన్నా వౌలికంగా ఆధ్యాత్మిక భావజాలాన్ని వ్యాపింపజేయడం, ప్రజల్లో ఇహలోక సుఖాల పట్ల వైముఖ్యాన్నీ పరమార్థంపట్ల చింతనను పెంపొందింపజేయడం అనేవి గురువుల లక్ష్యాలయ్యాయి. ప్రధానంగా ఈ లక్ష్యంతో ఎవరికి తోచిన మార్గాల్లోవారు కృషిచేస్తూ వచ్చారు. ఈ ప్రకృతినుంచి వ్యక్తమవుతున్న ఒకానొక చైతన్య స్వరూపమైన దివ్య ప్రణాళికకు తమ కార్యక్రమ సరళిని అనుసంధానిస్తూ ఈ డివైన్ ప్లాన్ ప్రకారం తమ ఆధ్యాత్మిక విధానాన్ని మలుచుకున్న గురువులు స్థూలంగా రెండు మార్గాలను అవలంబిస్తూ వచ్చారు. ఒకటి ప్రవచన మార్గం. రెండు ఉపాసనా మార్గం. భారతీయ తత్త్వశాస్త్రం పరిధిలోకి వచ్చే వివిధ శాస్త్రాలను మధించి, ఆయా విషయాలతో వేదాలకున్న సమన్వయాన్ని నిర్ధారించుకుని ప్రామాణికమైన ప్రాతిపదికతో ప్రజల ముందుకువచ్చి జ్ఞానబోధచేసే గురువులది ఒక మార్గం. ప్రజల మనసుల్లోని లోలోపల పొరల్లో మరుగున పడిపోయి ఉండే ఆత్మ తాలూకు చైతన్యాన్ని తమ ప్రభోదాల ద్వారా ఉత్తేజితంచేసి భగవంతుడిని జ్ఞానమార్గం ద్వారా గ్రహించి తరించే విధానాన్ని వారు ప్రజలకు తెలియజేస్తారు. రెండోది ఉపాసనా మార్గం. తీవ్రమైన తపశ్చర్యల ద్వారా భగవంతుడి ఆదేశాలను సూచనలను నేరుగా గ్రహించగలిగి ఒక వాహికగా వాటిని భక్తులకు చేరవేసే కార్యక్రమాన్ని కొందరు గురువులు చేస్తారు. అనుగ్రహ భాషణాది కార్యక్రమాలకన్నా పూజలు, క్రతువులు, హోమాల వంటి కర్మమార్గంలోని అంశాలకు వీరు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. భక్తులచేత కూడా వాటిని నిర్వహింపజేసి భగవంతుడి స్పర్శను స్వయంగా గుర్తించేలా ప్రోత్సహిస్తారు. భక్తుల అనుభవాలు, పీఠంలోని మహిమలు గమనిస్తే- అమ్మవారు సకల శక్తిస్వరూపిణి దుర్గగా దేవీ స్వరూపంలోనూ- నడిచే దైవంగా కరచరణాదులతో ఆచార్యుని రూపంలోను- రెండుగా వ్యక్తమవుతున్నట్లు రుజువవుతోంది. శ్రీ విజయదుర్గా పీఠాధిపతుల మాటలు ఆత్మీయతను వర్షిస్తాయి. చూపులు ప్రేమను ప్రసరిస్తాయి. ఆయన చేతి స్పర్శ ఒకానొక దివ్యానుభూతిని రేకెత్తిస్తుంది.
‘నేను చూసుకుంటాను రా’అనే ఒక్కమాట ఆయన నోటినుంచి వెలువడితే రోగగ్రస్తమైన దేహం వెంటనే తేలికైపోతుంది. మనసులో దిగులు మాయమైపోతుంది. బెంగ తీరిపోతుంది. దైవీకమైన ఈ పరిణామానికి కారణం అడిగితే ‘ఒరేయ్ నేనునిత్యం చేసే ఐదుకోట్ల జపంలో మూడు కోట్ల భాగాన్ని భక్తులకు ధారపోస్తున్నానురా’ అని చెప్పారాయన. మొన్న దీపావళి ముందువరకు మీ జీవితాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోండి. దీపావళినుంచి మార్పులు గమనించండి. నా భక్తులకు ప్రసారమవుతున్న నా తపశ్శక్తిని గురించి మీకే అర్థమవుతుంది అని సూచించారు. ఆయన తపస్సంపదకు వారసులైన భక్తులందరూ నిజంగా చాలా భాగ్యవంతులు. ‘దుర్గ దుర్గ దుర్గ’అంటూ నామజపంచేస్తే రోజుకో గంట చొప్పున ఆయుర్దాయం పెరిగితీరుతుంది’ అని గురువుగారు అభయం ఇచ్చారు.
ఇవన్నీ సాధనాగురువుల తత్వాన్ని నిరూపించే అంశాలు. భక్తులకోసం తపస్సును ధారపోస్తున్న గురువాయన. తన సాధనను పంచుతున్న గురువాయన. కలియుగపు మానవుల గురించి చెబుతూ భాగవతం ‘అలసులు, మంద బుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, సత్కర్మలేవియూ చేయజాలరీ మానవుల్గు’ అని బాధపడింది. అటువంటి యుగమందు మానవులకోసం నిరంతరం తపిస్తున్న యోగి, అర్ధంకాని అవధూత, తపస్సంపదను పంచుతున్న దాత, శ్రీశ్రీశ్రీ విజయదుర్గా పీఠాధిపతులు.
అందుకే ఆయన భక్తుల పాలిట గాడ్‌గారే.

- ఎర్రాప్రగడ రామకృష్ణ