జాతీయ వార్తలు

‘భారత్ మాతాకీ జై’ అనను ఏం చేస్తారో చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎస్‌ఎస్‌కు అసదుద్దీన్ సవాలు
ముంబయి, మార్చి 14: ‘్భరత్ మాతాకీ జై’ అన్న నినాదం చేయబోనంటూ ప్రకటించడం ద్వారా అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదానికి తెరదీశారు. భారత మాతను పొగుడుతూ నినాదాలు చేయడాన్ని నేటితరం యువతకు బోధించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనను సవాలు చేస్తూ ఒవైసీ ఈ ప్రకటన చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లో భారత వ్యతిరేక నినాదాలు చేయడంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ నెల 3న భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘్భరత మాతాకీ జై’ నినాదాలు చేయడాన్ని నేటితరం యువతకు బోధించాల్సిన సమయం వచ్చిందని, యువత సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా, నిజమైన దేశభక్తికి గుర్తుగా వారు తమంతట తామే ఈ నినాదాలు చేసేలా ఉండాలని భగవత్ అన్నారు. అయితే ‘ఆ నినాదాన్ని నేను చేయను. మీరేం చేసుకుంటారో చేసుకోండి’ అని ఆదివారం మహారాష్టల్రోని లాతూర్ జిల్లా ఉద్గిర్ తాలూకాలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఒవైసీ అన్నారు. అంతేకాదు ‘్భరత మాతాకీ జై’ అనాలని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదని కూడా ఆయన అన్నారు. అంతేకాదు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గుజరాత్‌లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇషత్ జహాన్ కుటుంబానికి తన మద్దతు కొనసాగుతుందని కూడా ఒవైసీ స్పష్టం చేశారు.