జాతీయ వార్తలు

బిజెపిలో మళ్లీ అసమ్మతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోషీ నివాసంలో అద్వానీ ప్రభృతుల భేటీ * కీర్తి ఆజాద్ సస్పెన్షన్‌పై చర్చ

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై అవినీతి ఆరోపణలు చేసిన ఎంపి కీర్తి ఆజాద్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేయటంపై బిజెపిలో మరోసారి అసమ్మతి గొంతు విప్పింది. పార్టీ సీనియర్ నాయకులు, మార్గదర్శక మండలి సభ్యులు ఎల్‌కె అద్వానీ, మురళీమనోహర్ జోషీ, సీనియర్ నాయకులు యశ్వంత్ సిన్హా, శాంతకుమార్‌లు గురువారం ఢిల్లీలో జోషీ నివాసంలో సమావేశమై కీర్తి ఆజాద్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేసేందుకు దారితీసిన పరిస్థితులపై చర్చలు జరిపారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై కీర్తి ఆజాద్ చేసిన ఆరోపణలో ఉన్న నిజమెంత? పార్టీ అధినాయకత్వం జైట్లీకి మద్దతు ప్రకటించటం మూలంగా పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది చర్చించినట్లు తెలిసింది. కీర్తి ఆజాద్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేయటం ఎంతవరకు సమంజసం? జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఉన్న సమయంలో జరిగిన అవినీతికి ఆయన ఎంతవరకు బాధ్యుడు? అనేది కూడా సీనియర్ నాయకులు చర్చించినట్లు చెబుతున్నారు. పార్టీ నుండి తనను సస్పెండ్ చేసేందుకు గల కారణం ఏమిటనేది తనకు లిఖితపూర్వంగా చెప్పాలంటూ కీర్తి ఆజాద్ చేసిన ప్రకటన కూడా చర్చకు వచ్చిందని జోషీ సన్నిహితులు చెబుతున్నారు. జైట్లీపై కీర్తి ఆజాద్ చేసిన ఆరోపణలలోని నిజానిజాలను కూడా నిగ్గు తేల్చవలసి అవసరం ఉన్నదని ఒక సీనియర్ నాయకుడు సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. కీర్తి ఆజాద్ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి బిజెపిని రాజకీయంగా దెబ్బతీశారని పార్టీ అధినాయకత్వం ఆరోపించటం తెలిసిందే.
గతంలో బిహార్ ఆసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన అనంతరం ఈ నలుగురు సీనియర్లు సమావేశమై బిజెపి ఓటమికి దారితీసిన పరిస్థితులను విశే్లషించటంతోపాటు ఓటమికి సీనియర్ నాయకులు బాధ్యత వహించాలని డిమాండ్ చేయటం తెలిసిందే. బిహార్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని పని చేసిన నరేంద్ర మోదీ అసెంబ్లీ ఎన్నికల ఓటమికి బాధ్యత వహించాలని వారు అప్పట్లో డిమాండ్ చేయటం తెలిసిందే. సీనియర్ నాయకులు ఇప్పుడు మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించటంతోపాటు కీర్తి ఆజాద్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేయటాన్ని తప్పుపట్టటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. (చిత్రం) బిజెపి సీనియర్ నేతలు సమావేశమైన జోషీ నివాసం వెలుపల గుమికూడిన విలేఖరులు